Pages

Subscribe:

Sunday 24 July 2011

దేవుడున్నాడా?-6

3. విశ్వం సృజింపబడిందా?

విశ్వానికి ఒక ఆరంభమైనా ఉండాలి లేక అది ఆదిసంభువైయుండాలి. మనకున్న అధారాలనుబట్టి విశ్వానికి ఒక పుట్టుక (ఆరంభం) ఉన్నది అని స్పష్టమవుతుంది. "ఆరంభం" అనేది ఒక కార్యం కాబట్టి దానికి ఒక కారణం ఉండాలి (Law of Cause and Effect). అంటే విశ్వాన్ని ఏదైనా లేక ఎవరైనా సృష్టించి ఉండాలి. కారణం లేక కర్త లేనిది ఏ కార్యం జరుగదు.

విశ్వం ఆదిసంభువు మరియు విశ్వం స్వీయోత్పత్తి గావించుకొన్నది అనే ప్రతిపాదనలు వ్యర్థమైనవని గత భాగాల్లో వివరించబడింది. ఇక మిగిలింది విశ్వం సృజింపబడుట అనే ప్రత్యామ్నాయం. కాబట్టి విశ్వం తనకంటే బలమైన ఒక శక్తిచే సృజింపబడినది.

ఇంకో విషయం ఏమిటంటే, ఒకప్పుడు అంతా శూన్యముంటే, ఇప్పుడూ ఇంకెప్పుడూ శూన్యమే ఉండాలి. సైన్స్ ప్రకారం శూన్యం శూన్యాన్నే ఇవ్వగలదు కాని పదార్థాన్ని కాదు. ఈ కారణంగా ఇప్పుడు పదార్థం (విశ్వం) ఉంది గనుక నిత్యత్వం కలిగిన, స్వయంభువైన రాశి లేక శక్తి ఉండియుండాలి. ఆ శక్తి సృజన గావించాలంటే జీవముగలదై లేక గలవాడైయుండాలి (Nothing produces nothing and something produces something; And that something which is capable of producing or creating ought to be superior and eternal).    

ఇప్పటివరకు గమనించిన విషయాలను పరిగణలోకి తీసుకొంటె, ఒక ఆస్తికుని వాదం ఇలా ఉంటుంది:
1) ఉనికి కలిగియున్న సర్వం పదార్థం మరియు సృజన శక్తి కలిగిన జీవమైయుండాలి.
2)ఇప్పుడు పదార్థ లేక వస్తువు ఉనికి ఉంది గనుక అనాదిగా ఉనికికలిగియున్నదేదైనా ఉండియుండాలి.
3)కాబట్టి పదార్థం లేక సృజన శక్తి అను రెంటిలో ఒకటి ఆదిసంభువైయుండాలి.
4)పదార్థం (విశ్వం) తననుతాను సృజించుకొనలేదు కాబట్టి అది ఆదిసంభువు కాదని మనము తెలుసుకొన్నాం.
5)కాబట్టి సృజన శక్తి కలిగినదే లేక కలిగినవాడే ఆదిసంభువు లేక నిత్యుడు.

ఆస్తికుడు కానటువంటి రాబర్ట్ జస్త్రో ఇలా అన్నాడు: "మనకున్న ఆధారలనుబట్టి విజ్ఞానానికందని ఒక అద్వితీయమైన శక్తి ఉన్నది అనునది సైన్స్ కూడా తప్పక చెప్పే సత్యం! (1982)."

దీనంతటినీ ఒక సామాన్యభాషలో చెప్పాలంటే:

ఉదాహరణకు, ఒకచోట కొన్ని సిమెంట్ బస్తాలు, ఇసుక, నీరు, ఇటుకలు, రాళ్ళు ఉన్నాయనుకోండి. తాపిపనివాడు లేకుండా వాటంతటవే ఒక నిర్మాణంగా రూపుదిద్దుకొంటాయా?
"రూపుదిద్దుకొంటాయి" అని మన పిల్లలను పంపే స్కూల్లలో గొప్ప scientific factsగా బోధించుచున్నారు! రూపుదిద్దుకొంటే దిద్దుకొన్నాయి, అసలు ఈ ముడి పదార్థాలు ఎక్కడివి? "అవీ వాటంతట అవే శూన్యం నుండి వచ్చాయి!"- ఇది మన సైన్స్!
సత్యమేదో మీరే గ్రహించండి. ఎందుకంటే సత్యం మనలను స్వంతంత్రులనుగా చేస్తుంది!

సత్యమేవ జయతే!!

NOTE: I'm not against science, but some 'madness' is proclaimed as science and an exhaustive propaganda campaign has been launched just out of resentment and anger against the idea of God! I absolutely uphold, accept, and follow true science, and true science always reflects true God which is unfortunately a buried and lost truth! 

------------------END------------------------

1 comment:

rajasekhar Dasari said...

నాకు ఒక జోకు గుర్తుకువస్తుంది . దేవునికి మానవునుకి మధ్య పోటి ఏర్పడింది. మానవుడు అన్నాడు నేను కూడా సృష్టి చేయగలను అని అన్నాడు . దేవుడు సరే అని కొంత మట్టి తీసుకుని ఒక మనిషిని చేసి ప్రాణం పోశాడు. ఇప్పుడు మనిషి వంతు వచ్చింది , మనిషి కూడా సృష్టి చేయడానికి ప్రయత్నం మొదలుపెట్టి కొంత మట్టిని తీసుకున్నాడు. వెంటనే దేవుడు అన్నాడు , ఒక్క నిముషం నీ స్వంత మట్టిని తీసుకో నేను సృష్టoచిన మట్టి తీసుకోవద్దు .

Post a Comment