Pages

Subscribe:

Friday 5 August 2011

ఇస్లాం- పుట్టుపూర్వోత్తరాలు-1

మొదటి భాగం

మహమ్మద్‌ను, ఆయన ఆలోచనా దోరణిని అర్థం చేసుకోవాలంటె ఇస్లాంని, అది ఆవిర్భవించిన అరబ్బు సమాజ స్థితిగతులను, అప్పటి మరియు అక్కడి కఠినమైన పరిస్థితులను గూర్చి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మహమ్మద్ (క్రీ.శ.570) కాలంలో అరేబియా ద్వీపకల్పం ఎందుకూ పనికిరాని బీడుభూమి (ఎడారి)గా ఉండేది. భగభగ మండుచున్న సూర్యుడితో భరింపశక్యంకాని మండుటెండతో పగళ్ళు, యముకలు కొరికె చలితో రాత్రులు- నివసించడానికి చాలా ప్రతికూలమైన వాతావరణం కలిగి ఉండేది. ఒక్క పచ్చని మొక్క మొలిచేది కాదు. సంచారజాతుల అరేబియన్ తెగలు రాళ్ళ మధ్యలో, మారుతున్న ఇసుకతిన్నెల్లో గుడారాలు వేసుకొని నివసించేవారు.   

రోము ఆధీనంలోవున్న యూరోప్ మరియు మధ్య ప్రాశ్చంలోని అనేక ప్రాంతాలు, చక్కని రహదార్లు, నీటిపారుదల వ్యవస్థ, తాగునీటి వసతులు కలిగిన మరియు ధార్మిక, సాంస్కృతిక, శాస్త్రియ పరిణతి కలిగి, కళలు, సంగీతంతో విలసిల్లుతున్న బైజాంటియన్ సామ్రాజ్యంలోకి కలపబడుచుండగా, మరోపక్క మనుగడకోసం, తమ తెగల ఆధిపత్యం కోసం నిరంతరం ఒకరితో ఒకరు పోరాడుచు చుట్టున్న ప్రపంచంతో సంబంధం లేకుండా అర్థాయుష్కులుగా ప్రాణాలు విడుస్తూ అరేబియన్ల జీవితం సాగుతూండేది.        

ఇటువంటి కఠినమైన గడ్డుపరిస్థితుల్లో నుంచి ఇస్లాం పుట్టింది కాబట్టి, వారికి తెలియని (మరియు మనసుకు, దేహానికి ఆనందాన్ని, ఊరటని ఇచ్చే) సంగీతం, కళలు మరియు కొన్ని ఆటలు నిషిద్ధమైనవిగా పేర్కొనబడ్డాయి అని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. ఈ నిషేదాన్ని ఇప్పటికీ తాలిబాన్లు అమలుపరుస్తున్నారు (ఉల్లంఘించినవారికి శిక్షేమిటో వివరించనక్కర్లేదనుకొంటా! -ఇక్కడ మరియు ఇక్కడ చూడండి). ఇస్లాం ప్రకారం దానికి బాహ్యమైన జ్ఞానాన్వేషణను సమ్మతించదు. అందుకేనేమో ఒరియానా ఫల్లసి తాను రచించిన The Rage and the Pride అనే పుస్తకంలో ఇస్లాం గురించి రాస్తూ, "ఈ మతం (ఇస్లాం) మతాన్ని (ఇస్లాంని) తప్ప మరేది ఉత్పత్తి చేయలేదు." 

అరేబియన్ ద్వీపకల్పం యొక్క ప్రతికూల వాతావరణం వలన దీనిపై ఏ సామ్రాజ్యానికి ఆసక్తి కలుగలేదు. కాబట్టి అభివృద్ధిచెందిన అనాటి  ఇతర సంస్కృతుల ప్రభావం వీరిపై పడలేదు. పర్షియన్ల పుణ్యమాని తీరప్రాంతాలపై వీరి ప్రభావం వలన అరేబియన్లు లిపి కలిగిన అరబిక్‌భాషను నెమ్మదిగా అభివృద్ధి చేసుకొన్నారు. మేకలు, గొఱ్ఱెలకోసం అరేబియన్ ఎడారిపై దండయాత్రచేయడం వ్యర్థమని ఏ సైన్యం కూడా వీరిపైకి రాలేదు. కాబట్టి ఈ ప్రదేశం ప్రపంచంనుండి తెగిపోయినట్లుగా ఉండేది. గ్రీకుల తర్కంతో, భారతీయ గణిత మేధస్సుతో ప్రపంచమంతటిని తాకిన జ్ఞానోదయ ప్రభావం అరేబియన్ ప్రదేశంపై ఇసుమంతైనా పడలేదు. ఎందుకంటె వీరు అనుదినం విపత్కర వాతావరణంతోను, ఇతర తెగలతోను పోరాటాల్లో మునిగిపోయారు. 

No comments:

Post a Comment