Pages

Subscribe:

Saturday 13 August 2011

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-4

మక్కా నుండి తరిమివేయబడటంతో మహమ్మద్‌కు గర్వభంగమయ్యింది. "అల్లాహ్‌చే ఎన్నుకోబడ్డ ప్రవక్త" అనే ఆధిక్యత జనాల దృష్టిలో ప్రశ్నార్థకమయ్యింది. కాబట్టి మహమ్మద్ ప్రతీకారంతో రగిలిపోయాడు. అందుకే అతను మదీనాలో ఉన్నప్పుడు అల్లాహ్‌చే అందుకొన్న సందేశం (2వ సురా) ప్రతీకార అయతులతో (వాక్యాలతో) నిండిపోయింది. మక్కావారు తమను పట్టణం నుంచి బహిష్కరించి తిరిగి రాకుండా నిలువరించడమే చిత్రహింస అని "హింస"కు కొత్త నిర్వచనం చెప్పాడు మహమ్మద్. ఈ "చిత్రహింస"కు ప్రతిగా మక్కావారిపై దండెత్తాలని అల్లాహ్ ఆజ్ఞ అంటూ తన అనుచరులైన ముసల్మాన్లను ప్రేరేపించాడు. మహమ్మద్ ఉద్దేశమేమిటంటే మక్కావారు తమను హింసించినందుకు వారిపై యుద్ధం చేయడం, తమతో పోల్చుకొంటే ఒక విధంగా వారిని తక్కువగా శిక్షించినట్లే! మక్కానుండి వెలివేయబడ్డందుకు (చిత్రహింస) మక్కావారిపై దండెత్తి వారిని చంపేయాలనడం సబబేనా? (ఖురాన్ 2: 193- ఊచకోత కంటే "చిత్రహింస" భరింపజాలనిది).       

కాని మక్కావారు మహమ్మద్‌ను తరిమేయడం ముమ్మాటికి సరైన పనే. ఎందుకంటే మహమ్మద్ తన అనుచరులైన ముసల్మాన్లతో కలిసి ఆయుధాలు సమకూర్చుకొని మక్కావారిపై బహిరంగంగా తిరిగుబాటు వ్యూహాలు పన్నాడు. తమపై కక్ష్యగట్టి భౌతిక దాడులకు బెదిరించేవారికి ఏ నగరవాసులూ ఆశ్రయమివ్వరు. (అయినప్పటికీ, కొద్దికాలం తరువాత మక్కావారు తెలివితక్కువగా మహమ్మద్‌తో సంధి చేసుకొని అతనిని మక్కాలోనికి అనుమతించారు. కొద్దికాలంలోనే మక్కా మహమ్మద్ పాదాక్రాంతమయ్యింది. వారి ఆచారాలు, విశ్వాసాలు అన్నీ నిర్దాక్షిణ్యంగా తుడిచివేయబడ్డాయి).

మక్కావారు మహమ్మద్‌ను బహిష్కరించడానికి ఇంకో కారణమేమిటంటే, సర్వమతాలకు పూజాపీఠమైన మక్కాలోని కాబాను మహమ్మద్ మతమైన ఇస్లాంకు అప్పగించి కేవలం ఇస్లాం మాత్రమే అక్కడుండాలని మహమ్మద్ మొండిగా వాదించడం. ఇస్లాంలో పరమతసహనం పూర్తిగా కొరవడింది కాబట్టి మక్కావారు మహమ్మద్‌ను బహీష్కరించారు. ముస్లింలు కాబాచుట్టూ తిరగడానికి మక్కావారికి ఏం అభ్యంతరంలేదు కాని, ముస్లింలకు మాత్రం ఇతరులెవరు అక్కడ ప్రదిక్షణాలు చేయరాదని చెప్పేవారు. క్రీ.శ.630 లో మక్కాను కైవసం చేసుకొన్నాక వారన్న మాటలు అక్షరాల నిజం చేసారు- మక్కావారందరు ఇస్లాంలోకి మారాలి లేక చావాలి అని అవకాశమిచ్చి కాబాలోని అన్నీ విగ్రహాలని ధ్యంసం చేసారు. (ఖురాన్: సురా 9:18-19).   


ఇప్పుడు 2వ సురాలోని అయతుల్ని పరిశీలిద్దాం:

"......వారు ఎక్కడ దొరికుతే అక్కడ చంపేయండి, వారు మిమ్మల్ని ఏచోట్ల నుండి తరిమివేసితిరో అచ్చటనుండి వారినీ తరిమివేయుడి, ఎందుకంటే చంపడంకంటే చిత్రహింస ఇంకా కఠినమైనది. శాంతికరమైన ప్రార్థనా స్థలాలవద్ద వారితో పోరాడకండి కాని ఒకవేళ వారు మీపై దాడి చేస్తే అప్పుడు వారిని (అక్కడే) చంపండి. ఇదే అవిశ్వాసులకు తగిన బహుమానం. వారు మనలను హింసింపకుండునట్లు అంతమగువరకు పోరాడుడి, సంపూర్ణంగా అల్లాహ్ యొక్క మతం స్థాపింపబడువరకు పోరాడుడి!" (సురా 2:191-193).    

ఈ అయతులను చూపించి ముస్లింలు కేవలం ఆత్మరక్షణ కోసమే మహమ్మద్ పోరాడేవాడు అని వివరిస్తారు కాని చారిత్రిక సందర్భాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. నిజానికి ఈ వాక్యభాగం ముస్లింల ధౌర్జన్యాన్ని మరియు ఇస్లాం యొక్క బలవంతపు వ్యాప్తిని సమర్థించుకోడానికి వ్రాయబడినట్లు గ్రహించగలము.

మక్కావారు ముస్లింలపై దాడులు చేయలేదు. నేడు ముస్లింలు ఆరోపిస్తున్నట్లు అనాడు మక్కావారు ముస్లింలను చంపలేదు. ఇందుకు ఖురానే సాక్ష్యం- తరిమివేయబడటాన్ని చిత్రహింసగా మహమ్మద్ పేర్కొన్నాడు కాని మక్కావారు ముసల్మాలని చంపినట్లు పేర్కొనలేదు. పైపెచ్చు తాను చేయబోయే మారణకాండను సమర్థించుకోడానికి మక్కావారికి మేలు చేస్తున్నట్లు చిత్రహింసకంటే (తరిమివేయబడటానికంటే) చంపడం నయమని మక్కావారిని చంపులాగున ముసల్మాన్లను ప్రేరేపించాడు. (ఖురాన్‌లోని పై అయతుల్ని జాగ్రత్తగా చదవండి).

ఇంకో విషయం ఏంటంటే, మహమ్మద్ అన్నట్లు "చిత్రహింస (బహీష్కరింపబడుట) కంటే వధ మేలు" అనుకొంటే ఆత్మరక్షణకై పోరాడే మహమ్మద్ వారికి అదే చిత్రహింసను (బహిష్కరణను) శిక్షగా విధించాలని పై అయతుల్లో ఎందుకన్నట్లు? ఇది ప్రతీకారేచ్చ కాదా? మక్కావారు ముస్లింలను చిత్రహింసలు చేసి చంపారు అనే ఆరోపణల్లో సత్యముంటే వారు మొట్టమొదట మహమ్మద్‌నే చంపేవారు. వారికి నీతివుంది కాబట్టి బహిష్కరణతో సరిపెట్టారు. మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ ప్రాణాలు తీయడానికి తిరుగుబాటు చేసి అల్లర్లురేపుతున్న మహమ్మద్‌ను బహిష్కరించడం దయతో కూడుకొన్న న్యాయవిధా? లేక ప్రతీకారంతో మక్కా కారవాన్లపై దాడులు చేసి చంపి దోచుకోవడం  దయతో కూడిన పనా?        

1 comment:

Anonymous said...

చాలా చక్కగా వివరిస్తున్నారు.
ఏదో పోనీద్దూ రాజకీయనాయకులు టోపీలేసుకుని హలీం తినే నెల. చంద్రబాబు, ముక్కోడు, కిరణ్‌కుమార్, రోశయ్య, జానాలు రూమీ టోపీలతో ఫోటోలు, సందేశాలకోసం ఇంకా రాలేదే అని రోజూ పేపర్లలో వెతుకుతున్నా. ముసుగు-రాష్ట్రపతి సందేశం కూడా ఇంకా డ్యూ. :)

Post a Comment