Pages

Subscribe:

Wednesday 3 August 2011

"మొహమద్- అత్యంత శక్తివంతమైన, దేవునిచే నియమించబడిన ఆఖరి ప్రవక్త (?), ఖురాన్- నేరుగా అల్లానుండి గాబ్రియేలు దూత మొహమద్‌కు వల్లించిన దేవోక్తి (?), ఇస్లాం- పవిత్రమైన, శాంతికరమైన మతం (?)- విశ్లేషణ

"భారతీయ బానిస వ్యాపారం" అనే శీర్షికతో 8 టపాలు ఈ బ్లాగ్‌లో వ్రాసాను. ఐతే ఇది ఇంకా పూర్తికాలేదు. మిగిలిన విషయాలను త్వరలోనే పూర్తి చేస్తాను. రాబోయే టపాల్లో "ఇస్లాం" గురించి ముఖ్యంగా పవిత్ర(?) ఖురాన్ గురించి విస్తృతంగా చర్చించాలని అనుకొంటున్నాను. ఇప్పుడా అవసరం ఏమొచ్చింది అని చాలా మందికి అనిపించొచ్చు లేక మనకెందుకులే గొడవ అనుకోవచ్చు. ఇటువంటి మన నిర్లక్ష్యమే మన చరిత్రను రక్తసిక్తం చేసింది. అంతేగాక ఇస్లాం గురించి ఒక బహిరంగ చర్చ జరగడం చాలా అరుదు. ఒకవేళ ముస్లిం మతం గురించి ఎమైనా అపోహలు, అపార్థాలుంటె కూడా చర్చించడం ద్వారా తొలగించుకోవచ్చు. అది ఇస్లాం కే మంచిది కదా! ఖురాన్ నేరుగా అల్లా నుండి వచ్చింది అని ముస్లింలు నొక్కి చెబుతారు. అయితే ఖురాన్ని మిగిలిన మతగ్రంథాలతో పోల్చి చూసి ఇది ఎంతవరకు నిజమో సత్యానేషులు తెలుసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఖురాన్ విశ్వనీయతను నిరూపించుకొంటె మంచిది. అంతేకాని దాని గురించి మాట్లాడేవారిని చంపుతామని బెదిరించడం ఇప్పటివరకు అనేక ముస్లింలు చేస్తున్న పని. రాబోయే టపాల్లో ఖురాన్, మొహమద్ మరియు ఆయన ప్రకటించిన ఇస్లాం గురించి నేను తప్పుగా వ్రాసాను అని ఎవరైన అనుకొంటే లేక నేను అపార్థం చేసుకొన్నాను అనుకొంటే దానిని నిరూపించి జ్ఞానోదయం కలుగజేయగలరు (ఎవరైనా ఈ బ్లాగ్ చదివితే!).

2 comments:

Post a Comment