Pages

Subscribe:

Wednesday 10 August 2011

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-2

అప్పట్లో మక్కావాసులు ఎంతో సహనశీలురైయుండిరి. మక్కా యొక్క ఆర్థిక సామాజిక ప్రగతి అక్కడికి వచ్చే యాత్రీకులపై అధారపడి ఉన్నప్పటికీ, ఆ యాత్రీకులను, మక్కావారిని అపహాస్యం చేస్తూ, వారి విశ్వాసాల్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ మహమ్మద్ 13 సంవత్సరాలు తన కొత్తమతమైన ఇస్లాంని ప్రకటించసాగాడు. దీనినిబట్టి మక్కావారు ఎంత ఓర్పుతో వ్యవహరించారో స్పష్టంగా తెలుస్తుంది.

మొదట్లో మహమ్మద్ మాటల్ని ఆయన స్నేహితులు మరియు కుటుంబసభ్యులు మాత్రమే అంగీకరించారు. పదమూడేండ్ల మతప్రచారం తరువాత మహమ్మద్ సంపాదించుకొన్న అనుచరగణం కేవలం ఒక వందమంది. వీరు ముసల్మాలనబడిరి. మహమ్మద్ భార్య (ఆమె పరివారం మరియు పనివారు) కాకుండా ఇస్లాంని స్వీకరించిన మొట్టమొదటి  వ్యక్తి అలీ (ఇతను మహమ్మద్‌కు అల్లుడవుతాడు మరియు తరువాత నాల్గవ ఖలీఫాగా ఎంచబడతాడు). ఇస్లాంను స్వీకరించిన ఇంకో ముఖ్యమైన వ్యక్తి ధనవంతుడైన అబు బాకర్ అనే వర్తకుడు. ఇతని పుణ్యమాని ముస్లిం తెగ ప్రభలింది.   

మహమ్మద్, అల్లాహ్‌తోపాటు మక్కావారి దేవుళ్ళను కూడా అంగీకరించే"సైతాను సందేశం"(Satanic Verses) అనే సంఘటన తరువాత జరిగిన కొన్ని పరిణామాలాతో మహమ్మద్‌కు మక్కావారితో సంబంధాలు చెడాయి. (సైతాను సందేశం Satanic Verses అనగా- మహమ్మద్ తమ దేవతాదేవుళ్ళను అంగీకరించాడని తెలిసి మక్కావారు సంతోషించి మహమ్మద్‌ను ఆదరించిరి. దీవివల్ల మహమ్మద్ అనుచరులు ఆయన చెప్పిన మాటల విశ్వసనీయతను ప్రశ్నించిరి. తనవారు తనపై నమ్మకం కోల్పోతున్నారని మహమ్మద్ గ్రహించి తనతో ఆ మాటలు, అనగా పాగన్లతో, ఇతరమతస్తులతో కలిసుండాలనే మాటలు సైతాను ప్రేరేపించి చెప్పించాడని వారికి సంజాయిషీ ఇచ్చి మళ్లీ మక్కావారి మతాల్ని, ఆచారాల్ని ద్వేషించడం మొదలుపెట్టాడు- తబారీ:1192; ఖురాన్ 22:52; 53:19-26; అంటే మహమ్మద్ సైతానుచే ప్రేరేపింపబడి పరమతసహనం గురించి మాట్లాడుటను Satanic Verses అందురు).    

ఈ పరిణామంతో నివ్వేరపోయిన మక్కావారు ఇంతకుమునుపుకంటె కోపోద్రికులై ముస్లింలను ఇంకెక్కువగా అవమానించారు. మక్కావారు చేసిన ఈ అవమానాలనే ముస్లింలు "భయంకరమైన చిత్రహింసలు"గా పేర్కొంటారు. అయితే ఈ "చిత్రహింసల"ను గురించి ముస్లిం చరిత్రకారులైన ఇబ్న్ ఇషాక్ మరియు అల్ తబారీ వ్రాసిన వివరాలలో కేవలం ఒక్క ముస్లిం చనిపోయినట్లుగా ఉంది. అది కూడా ఒక వృద్ధ మహిళ- ఈమె ముస్లింలకు జరుగుతున్న అవమానాలకు, అశాంతికి కలతచెంది మనోవేదనతో మృతిచెందింది (ఎవరూ భౌతికంగా గాయపరిచి చంపలేదు).    

ముస్లింమత ఆధునిక పరిరక్షకులకు (modern apologists) ఇది మింగుడుపడని విషయం. ఎందుకంటే వీరు ఎంతసేపూ మక్కావారు చిత్రహింసలకు గురిచేయబట్టే మహమ్మద్ వీరిపై దాడులు చేసాడు అని పదే పదే వాదించి తెలియనివారిని నమ్మించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. అయితే సత్యమేంటో ముస్లిం చరిత్రకారులు వ్రాసిన చరిత్రపాఠాలను చూసి గ్రహించవచ్చు.  

{మక్కావారే మొదట కత్తిదూసారు అనేది పచ్చి అబద్ధం. ఇది ముస్లిం ప్రచారం (muslim propaganda). చెప్పాలంటే మహమ్మద్ అసలు ఏ కారణం లేకుండానే దాడిచేసిన సందర్భాలున్నాయి. వీటి గురించి తదుపరి టపాలో వివరిస్తాను.}  

No comments:

Post a Comment