Pages

Subscribe:

Friday 5 August 2011

ఇస్లాం- పుట్టుపూర్వోత్తరాలు-2

రెండవ భాగం

అరేబియన్లకు, వారున్న కఠినపరిస్థితుల్లో వారి స్వంత అవసరాలు తీర్చుకొవడమే నైతికత అనిపించేది. కొద్దోగొప్పో కేవలం వారి వారి తెగ(గుంపు) వరకే ఒకరికొకరు తప్పనిసరి విధిగా సహాయంచేసుకొనేవారు. బహుశా వారున్న ఆ ప్రాంతపు కఠోర వాతావరణం మరియు బాహ్యప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకపోవడం వారిని అంత కఠినులుగా, స్వార్థపరులనుగా చేసుండొచ్చని విశ్లేషకుల అభిప్రాయం. ఇతరుల పట్ల ఇస్లాం మతస్తుల దృక్పథం ఎలా ఉంటుందో అర్థంచేసుకోవడానికి ఈ ప్రాథమిక అంశాలు ఎంతో తోడ్పడతాయి. అందుకే వీరి యొక్క నైతిక విలువలు, న్యాయ సూత్రాలు ముస్లింలకు ప్రయోజనకరంగా ఉండేటట్లు రూపొందించబడ్డాయి. అంటే వీరు చిన్న తెగల నుండి ప్రపంచముతో, తోటి మనుషులతో సంబంధంలేని ఒక పెద్ద తెగగా (ఇస్లాం మతస్తులు) ఏర్పడ్డారు. కాబట్టి వారి పూర్వికుల్లాగే కేవలం వీరి స్వార్థం చూసుకొంటారు (హడీస్ మరియు ఖురాన్‌ల్లోని అనేక భాగాల్లో అన్యులతో వ్యవహారం ఎంత వివక్షతో కూడి ఉంటుందో చూడగలము. రాబోయే టపాల్లో రెఫరెన్సులతో సహా వివరిస్తాను). 

అరేబియాలో, ముఖ్యంగా మహమ్మద్ జన్మించిన మక్కా వంటి వ్యాపార ప్రాధాన్య కేంద్రాల్లో అనేక మతాలు, ఆచారాలు ఉండేవి. వివిధ మతాల యాత్రికులను ఆకర్షించడానికి వారి మతసంబంధమైన ఘనాకారంలో "కాబా" అనే నిర్మాణాలు కొన్ని పట్టణాల్లో ఉండేవి. మక్కాలోని కాబాలో అనేక
దేవతాదేవుళ్ళ ప్రతిమలు ఉండేవి. ఇప్పటికీ ఒక నల్లని ఉల్క రాయి మెక్కాలోని కాబాలో ఉన్నది.  

ఈ నల్లని ఉల్క రాతితో పాటు మహమ్మద్ యొక్క ఖురేషీ తెగవారు "అల్లాహ్" అనే ఒక చంద్ర (నెలవంక) దేవుణ్ణి మొక్కేవారు. ఇంకా అనేక దేవతాదేవుళ్ళకు మక్కాలో ప్రాధాన్యం ఉండేది. మక్కావాసులు సర్వమత సహనశీలురిగా ఉండేవారు. సుదూర ప్రాంతాలనుండి వివిధ మతవిశ్వాసులు మక్కాకు వచ్చి వారి ప్రార్థనలను, పూజలను చేసుకొనేవారు (మహమ్మద్ మక్కాను స్వాధీనపర్చుకొన్నాక ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది).

ఈ వివిధ మతాచారాలనుండి మరియు మహమ్మద్ క్రైస్తవ్యంలోని మరియు యూదా మతంలోని (తప్పుగా) అర్థంచేసుకొన్న అంశాలనుండి పుట్టిన మతమే ఇస్లాం (మహమ్మద్‌కు తాను విన్న, గమనించిన సిరియా, అరేబియా చుట్టు పక్కల వ్యాప్తిచెందిన బైబిల్‌కు భిన్నమైన, కలుషితమైన క్రైస్తవ్యం గురించిన జ్ఞానం ఖురాన్లో స్పష్టంగా కనబడుతుంది. ఉదాహరణకు, యేసు తల్లియైన మరియా మరియు యేసుకంటే సుమారు 1400 సంవత్సరాల పూర్వమున్న మోషే సోదరియైన మిర్యాము ఒకరే అని మహమ్మద్ అనుకొన్నాడు. అంటే మొహమ్మద్‌కు వీరు ఒకేతరం వారు కాదు అన్న ఇంగితం కూడా లేదు. ఈ విషయాలన్నీ స్వయానే దేవుడైన (?) అల్లాహ్ మహమ్మద్‌కు గాబ్రియేలు దూత ద్వారా తెలిపాడు. పాపం దేవుడైన (?) అల్లాహ్‌కి కూడా వీరు సమకాలీనులు కారు అనే విషయం అర్థం కాలేదు- ఇంకా ఇట్లాంటి తప్పులు ఖురాన్లో కోకొల్లలు!). 

1 comment:

rajasekhar Dasari said...

ఈ మధ్య వాళ్ళు సంక్షిప్త వ్యాఖ్యానంతో ఖురాన్ ప్రచురించడం మొదలు పెట్టారు . ఇలాంటి సమస్యలను వ్యాఖ్యానం ద్వారా సరిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారు. అది మరింత తప్పుల తడకగా మారింది. ఉదాహరణకు మిర్యాము తండ్రి పేరు ఇమ్రాం కావచ్చు లేక ఇమ్రాం సంతతి అయిఉండవచ్చు . ఇమ్రాం లేవి వంశస్తుడు, మరియ యూదా వంశస్థురాలు.

Post a Comment