Pages

Subscribe:

Ads 468x60px

Featured Posts

Saturday 13 August 2011

ఫిత్నా- ద మూవీ





courtesy: http://www.geertwilders.nl/index.php?option=com_frontpage&Itemid=1
 
నెథర్‌ల్యాండ్స్ పార్టీ ఫర్ ఫ్రీడం అధ్యక్షుడైన Geert Wilders ఇస్లాం మతంపై తాను తీసిన మిని డాక్యుమెంటరీ మూవీ ఫిత్నా (Fitna) ముస్లిం మనోభావాలను దెబ్బతీసిందని మరియు ఇది విద్వేషంతో కూడినదని (Hate Speech) కేసు బుక్‌చేసి విచారిస్తున్నారు. Fitnaలో Wilders చూపించిన సన్నివేశాలు మరియు వాక్యాలన్ని ఇస్లామిక్ గ్రంథాలైన ఖురాన్, హడీస్, సీరాల నుండి తీసుకొన్నవే! అప్పుడది Hate Speech ఎలా అవుతుంది? Wilders కూడా తెలివిగా తన కోర్టు విచారణలో సాక్షులుగా ముస్లిం విద్వాంసులని (Muslim Scholars), ముల్లాలని, ముఫ్టీలని ఆహ్వానించాడు. Fitnaలో ఉన్న విషయాలు వారు కాదనలేరు. సాక్షులను విచారించకుండానే చేసేది లేక Geert Wilders Trialని డిస్మిస్ చేసారు. మళ్ళీ Wildersను కోర్టు బోనెక్కించడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Geert Wilders- ఇస్లామిక్ అణచివేతను వాక్‌స్వతంత్రంతో (Free Speech) ఎదుర్కొంటున్న ఒక మానవతావాది, స్వేచ్ఛని సమాధానాన్ని కోరుకొనే నిజమైన చాంపియన్! Geert Wilders తీసిన "ఫిత్నా"ని ఇక్కడ చూడండి. 

(Full screenలో చూడండి- వీడియోలో ఖురాన్, హడీస్ నుంచి సేకరించిన వాక్యాలను చదవండి)

 

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-4

మక్కా నుండి తరిమివేయబడటంతో మహమ్మద్‌కు గర్వభంగమయ్యింది. "అల్లాహ్‌చే ఎన్నుకోబడ్డ ప్రవక్త" అనే ఆధిక్యత జనాల దృష్టిలో ప్రశ్నార్థకమయ్యింది. కాబట్టి మహమ్మద్ ప్రతీకారంతో రగిలిపోయాడు. అందుకే అతను మదీనాలో ఉన్నప్పుడు అల్లాహ్‌చే అందుకొన్న సందేశం (2వ సురా) ప్రతీకార అయతులతో (వాక్యాలతో) నిండిపోయింది. మక్కావారు తమను పట్టణం నుంచి బహిష్కరించి తిరిగి రాకుండా నిలువరించడమే చిత్రహింస అని "హింస"కు కొత్త నిర్వచనం చెప్పాడు మహమ్మద్. ఈ "చిత్రహింస"కు ప్రతిగా మక్కావారిపై దండెత్తాలని అల్లాహ్ ఆజ్ఞ అంటూ తన అనుచరులైన ముసల్మాన్లను ప్రేరేపించాడు. మహమ్మద్ ఉద్దేశమేమిటంటే మక్కావారు తమను హింసించినందుకు వారిపై యుద్ధం చేయడం, తమతో పోల్చుకొంటే ఒక విధంగా వారిని తక్కువగా శిక్షించినట్లే! మక్కానుండి వెలివేయబడ్డందుకు (చిత్రహింస) మక్కావారిపై దండెత్తి వారిని చంపేయాలనడం సబబేనా? (ఖురాన్ 2: 193- ఊచకోత కంటే "చిత్రహింస" భరింపజాలనిది).       

కాని మక్కావారు మహమ్మద్‌ను తరిమేయడం ముమ్మాటికి సరైన పనే. ఎందుకంటే మహమ్మద్ తన అనుచరులైన ముసల్మాన్లతో కలిసి ఆయుధాలు సమకూర్చుకొని మక్కావారిపై బహిరంగంగా తిరిగుబాటు వ్యూహాలు పన్నాడు. తమపై కక్ష్యగట్టి భౌతిక దాడులకు బెదిరించేవారికి ఏ నగరవాసులూ ఆశ్రయమివ్వరు. (అయినప్పటికీ, కొద్దికాలం తరువాత మక్కావారు తెలివితక్కువగా మహమ్మద్‌తో సంధి చేసుకొని అతనిని మక్కాలోనికి అనుమతించారు. కొద్దికాలంలోనే మక్కా మహమ్మద్ పాదాక్రాంతమయ్యింది. వారి ఆచారాలు, విశ్వాసాలు అన్నీ నిర్దాక్షిణ్యంగా తుడిచివేయబడ్డాయి).

మక్కావారు మహమ్మద్‌ను బహిష్కరించడానికి ఇంకో కారణమేమిటంటే, సర్వమతాలకు పూజాపీఠమైన మక్కాలోని కాబాను మహమ్మద్ మతమైన ఇస్లాంకు అప్పగించి కేవలం ఇస్లాం మాత్రమే అక్కడుండాలని మహమ్మద్ మొండిగా వాదించడం. ఇస్లాంలో పరమతసహనం పూర్తిగా కొరవడింది కాబట్టి మక్కావారు మహమ్మద్‌ను బహీష్కరించారు. ముస్లింలు కాబాచుట్టూ తిరగడానికి మక్కావారికి ఏం అభ్యంతరంలేదు కాని, ముస్లింలకు మాత్రం ఇతరులెవరు అక్కడ ప్రదిక్షణాలు చేయరాదని చెప్పేవారు. క్రీ.శ.630 లో మక్కాను కైవసం చేసుకొన్నాక వారన్న మాటలు అక్షరాల నిజం చేసారు- మక్కావారందరు ఇస్లాంలోకి మారాలి లేక చావాలి అని అవకాశమిచ్చి కాబాలోని అన్నీ విగ్రహాలని ధ్యంసం చేసారు. (ఖురాన్: సురా 9:18-19).   


ఇప్పుడు 2వ సురాలోని అయతుల్ని పరిశీలిద్దాం:

"......వారు ఎక్కడ దొరికుతే అక్కడ చంపేయండి, వారు మిమ్మల్ని ఏచోట్ల నుండి తరిమివేసితిరో అచ్చటనుండి వారినీ తరిమివేయుడి, ఎందుకంటే చంపడంకంటే చిత్రహింస ఇంకా కఠినమైనది. శాంతికరమైన ప్రార్థనా స్థలాలవద్ద వారితో పోరాడకండి కాని ఒకవేళ వారు మీపై దాడి చేస్తే అప్పుడు వారిని (అక్కడే) చంపండి. ఇదే అవిశ్వాసులకు తగిన బహుమానం. వారు మనలను హింసింపకుండునట్లు అంతమగువరకు పోరాడుడి, సంపూర్ణంగా అల్లాహ్ యొక్క మతం స్థాపింపబడువరకు పోరాడుడి!" (సురా 2:191-193).    

ఈ అయతులను చూపించి ముస్లింలు కేవలం ఆత్మరక్షణ కోసమే మహమ్మద్ పోరాడేవాడు అని వివరిస్తారు కాని చారిత్రిక సందర్భాలు అందుకు భిన్నంగా ఉన్నాయి. నిజానికి ఈ వాక్యభాగం ముస్లింల ధౌర్జన్యాన్ని మరియు ఇస్లాం యొక్క బలవంతపు వ్యాప్తిని సమర్థించుకోడానికి వ్రాయబడినట్లు గ్రహించగలము.

మక్కావారు ముస్లింలపై దాడులు చేయలేదు. నేడు ముస్లింలు ఆరోపిస్తున్నట్లు అనాడు మక్కావారు ముస్లింలను చంపలేదు. ఇందుకు ఖురానే సాక్ష్యం- తరిమివేయబడటాన్ని చిత్రహింసగా మహమ్మద్ పేర్కొన్నాడు కాని మక్కావారు ముసల్మాలని చంపినట్లు పేర్కొనలేదు. పైపెచ్చు తాను చేయబోయే మారణకాండను సమర్థించుకోడానికి మక్కావారికి మేలు చేస్తున్నట్లు చిత్రహింసకంటే (తరిమివేయబడటానికంటే) చంపడం నయమని మక్కావారిని చంపులాగున ముసల్మాన్లను ప్రేరేపించాడు. (ఖురాన్‌లోని పై అయతుల్ని జాగ్రత్తగా చదవండి).

ఇంకో విషయం ఏంటంటే, మహమ్మద్ అన్నట్లు "చిత్రహింస (బహీష్కరింపబడుట) కంటే వధ మేలు" అనుకొంటే ఆత్మరక్షణకై పోరాడే మహమ్మద్ వారికి అదే చిత్రహింసను (బహిష్కరణను) శిక్షగా విధించాలని పై అయతుల్లో ఎందుకన్నట్లు? ఇది ప్రతీకారేచ్చ కాదా? మక్కావారు ముస్లింలను చిత్రహింసలు చేసి చంపారు అనే ఆరోపణల్లో సత్యముంటే వారు మొట్టమొదట మహమ్మద్‌నే చంపేవారు. వారికి నీతివుంది కాబట్టి బహిష్కరణతో సరిపెట్టారు. మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ ప్రాణాలు తీయడానికి తిరుగుబాటు చేసి అల్లర్లురేపుతున్న మహమ్మద్‌ను బహిష్కరించడం దయతో కూడుకొన్న న్యాయవిధా? లేక ప్రతీకారంతో మక్కా కారవాన్లపై దాడులు చేసి చంపి దోచుకోవడం  దయతో కూడిన పనా?        

Friday 12 August 2011

ఇది రమదాన్! దేశమేదైనా పాటించకపోతే....పగిలిపోద్ది

టర్కీష్ జాతీయుడైన ఒక జర్మన్ M.P. రమదాన్ మాసంలో సాసేజ్ ఆర్డర్ చేస్తే...... ఎమయ్యిందో మీరే ఇక్కడ చదవండి! 

Thursday 11 August 2011

4.9 కోట్ల మంది హిందువుల ఆచూకీ?

బంగ్లాదేశ్‌లో 1949 నుండి సుమారు 4.9 కోట్ల హిందువుల అదృశ్యం గురించి మాట్లాడుతూ నియర్ ఈస్ట్ మరియు సౌత్ సెంట్రల్ ఆసియాలో మానవ హక్కులు మరియు మత స్వేచ్ఛకై హెచ్.ఆర్. 440 బిల్లును సమర్థిస్తున్న రిప్రసెంటెటివ్ డోల్డ్. బంగ్లాదేశ్‌లోని హిందువులపై దాడులు మరియు వారి బలవంతపు వలసలు, ఇరాక్‌లోని మిషాబా ప్రాంత క్రైస్తవులపై కఠిన ఆంక్షలు మరియు ఇరాన్‌లో బహాయ్ మతస్తుల నిర్బంధాలను ఖండిస్తూ ఇవి భరింపలేని హింసలని అమెరికన్ పార్లమెంట్ సభ్యుడైన డోల్డ్ పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితులను నివారించడానికి  హెచ్.ఆర్. 440 బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు.

ఎన్నో శాంతి సందేశాలిచ్చే ముస్లిం సమర్థకులు, ముల్లాలు ఇస్లామిక్ దేశాల్లో మైనారిటీ మతస్తులపై జరిగే ఆకృత్యాలకు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఇస్లాం శాంతికరమైన మతమైతే వారి దేశాల్లోని మైనారిటీలు ఇళ్ళు, ఆస్తులు వదిలేసి ఎందుకు పారిపోతారో ముస్లిం అపాలజిస్ట్లు, ముల్లాలు సమాధానం చెప్పాలి. ఎటూ పారిపోలేనివారు అంత దీనావస్థలో ఎందుకుంటారో చెప్పాలి. ముస్లిం చట్టాల్లో ముస్లిమేతరులపై వివక్ష ఎందుకుంటుందో చెప్పాలి.


 

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-3

మొదట రక్తం చిందించింది మక్కావారే కాబట్టి వారినుండి రక్షించుకోడానికి మహమ్మద్ పోరాడాడు అని ముస్లింలు, ముల్లాలు సమర్థించుకొంటారు. అయితే ఇది ఎంతవరకు నిజమో చరిత్రను పరిశీలిద్దాం.

ఒకసారి ముసల్మాన్లు ప్రార్థనలు చేసుకొనుచుండగా ఒక అన్యమతస్తుడు వారికి అంతరాయం కలిగిస్తున్నాడనే నెపంతో సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ అనే ముస్లిం నాయకుడు అతన్ని ఒంటె దవడయముకతో కొట్టి చంపాడు. ఇస్లాం పరిరక్షణకై మొట్టమదటి హత్య ఇదే (ఇబ్న్ ఇషాక్/హిషాం:166). 

కొత్తగా ఇస్లాం మతం పుచ్చుకొన్నవారికి మతం పేరుతో ఎవరినన్నా హింసించినా తప్పించుకోవచ్చనుకొనేవారు. ఒకసారి అబూ జహ్ల్ (విగ్రహారాధికుడు) అనే మక్కా పెద్ద మహమ్మద్‌ను కించపరుస్తూ మాట్లాడాడనే నెపంతో హంజా అనే ఒక బలమైన ముస్లిం అతనిని తన విల్లుతో బలంగా కొట్టాడు. అబూ జహ్ల్ బలహీనుడగుటచే ఏమీచేయలేక ఇంటికి వెళ్లి తన దగ్గర పనిచేస్తున్న ముస్లిం సేవకులని ప్రతీకారంతో హింసించాడు. ఈ విధంగా ముస్లింలు జరిగించే హింసకు ప్రతిహింస కూడా పెరిగిపోయింది (ఇబ్న్ ఇషాక్/హిషాం:185).

తగినంత సంఖ్యా బలం పొందుకొన్నాక, ముస్లింలు మక్కావారిపై మొట్టమొదట యుద్ధం ప్రకటించారు. అయితే ఈ యుద్ధంలో ముస్లింలు ఓడిపోయి మక్కా నుండి తరిమివేయబడ్డారు. ముస్లింలు అక్కడనుండి మదీనాకు వలసపోయి స్థిరపడ్డారు. అయినా మహమ్మద్ తన ఓటమిని జీర్ణించుకోలేక మక్కావారి కారావాన్లపై తెగబడి దాడులు చేసి వారిని చంపుతూ దోపుడు సొమ్ము కొల్లగొట్టేవాడు. 

****************
మదీనాలో నివసించేటప్పుడు కూడా మక్కావారు ముస్లింలను హింసించేవారు అని ముస్లింలు మాటిమాటికి ఆరోపిస్తారు. ఇందులో ఎంతవరకు సత్యముందో పరిశీలిద్దాం: 

మహమ్మద్ తన అనుచరులతో మదీనాకు వలసవెళ్లాక (హిజ్రా) కొద్దికాలానికి అతనికి అల్లాహ్ గాబ్రియేలు దూత ద్వారా ఇచ్చిన సందేశమే ఖురాన్‌లోని రెండవ అధ్యాయం (2వ సురా). ఈ అధ్యాయంలో హింసాత్మక వచనాలు అధికంగా ఉంటాయి (ఎందుకో అర్థం చేసుకోవచ్చు- మహమ్మద్ మక్కానుంచి తరిమివేయబడ్డాడు కాబట్టి!). 2వ సురాలో ఉన్న రెచ్చగొట్టే విషయాలను కప్పిపుచ్చుకోడానికి లేక సమర్థించుకోడానికి ముస్లిం మత సమర్థకులు (muslim apologists) మదీనాలో కూడా ముస్లింలను మక్కావారు హింసించారని ఆరోపిస్తారు. 2వ అధ్యాయంలోని వచనాలు అవిశ్వాసులైన పాగన్లు, విగ్రహారాధికులు, క్రైస్తవులు మరియు యూదులు ముస్లింలపై చేసిన అక్రమాలకి, దౌర్జన్యాలకి మరియు హింసకు ప్రతిగా వారిని తుదముట్టించుటకు ప్రేరేపిస్తాయి.  వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి ముస్లిం విద్వాంసులు అనాడు మదీనాలోని ముస్లింలపై అనేక దాడులు జరిగి చిత్రహింసలనుభవించారని వివరిస్తారు.  

దురదృష్టమేంటంటే మహమ్మద్ "చిత్రహింస" అని దేనిగురించి అన్నాడో ముస్లిం చరిత్రకారుల వివరణలను ఇంతకుముందే చూసాము. నేడు "హింస" అంటే భౌతికంగా, మానసికంగా సరైన కారణం లేకుండా గాయపర్చడం. మహమ్మద్ ప్రకారం "చిత్రహింస" అంటే ఆయన చెప్పింది అనుసరించకపోవడం, అతను రెచ్చగొడుతున్న మతవిద్వేషాలకు హెచ్చరించడం, యుద్ధం ప్రకటిస్తే అతనిని ఓడించి సంహరించకుండా, భౌతికంగా గాయపరచకుండా మక్కా నుంచి బహిష్కరించడం. ఈ "చిత్ర హింస"లకు ప్రతిగా అవిశ్వాసులను (కాఫీర్లను) సంహరించడం సరైన న్యాయం అని మహమ్మద్‌కు అల్లాహ్ సందేశమిచ్చాడు. (మహమ్మద్ మక్కావారి చిత్రహింసలు తాలలేక తనను తన అనుచరులను రక్షించుకోడానికి మాత్రమే కత్తి పట్టాడు- ఇది ముస్లిం సమర్థకుల వాదన). నిజానికి గమనించినట్లైతే, మక్కావారు మహమ్మద్ దాడులనుంచి తమనుతాము కాపాడుకోడానికి ప్రయత్నించారు. వారికి ఇస్లాం ఒక మతంగా మక్కాలోని కాబాలో ఉండడానికి, వారి మతప్రచారం చేసుకోడానికి ఎటువంటి అభ్యంతరం లేకపోయెను కాని కాబాలో కేవలం ఇస్లామే ఉండాలి, అన్యమతాలు వ్యర్థం అని దూషణలకు దిగినప్పుడు మాత్రమే వారు అభ్యతరం తెలిపారు.

మహమ్మద్ 2వ సురా ప్రకటించినప్పుడు వారిపై దాడులు జరిగినట్లు ఏ చరిత్రకారుడూ తెలుపలేదు. వారిపై సైన్యాలు దండెత్తి రావడం కాని లేక అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లుగాని ఎటువంటి అధారాలు లేవు. మదీనాపై మక్కావారి ప్రభావం ఎంతమాత్రము లేకుండెను. ముస్లింలు ఆరోపించినట్లు ఆనాడు వారిపై మదీనాలో ఎటువంటి హింసా లేక దాడి జరుగలేదు. "సీరా (biography)"లో వివరింపబడిన ప్రకారం తమపై యుద్ధం ప్రకటించి బహీష్కరణకు గురైన మహమ్మద్‌నకు హాని చేసే ఉద్దేశం మక్కావారికి ఎంతమాత్రం లేదు. 

అసలు ముస్లింలపై నిరంతరం దాడులు జరిగినట్లైతే వారిని పదే పదే యుద్ధానికి ప్రేరేపించాల్సిన అవసరం ఎందుకు? ఉదాహరణకు, ఎవరైనా మీ ఇంట్లోకి చొరబడి మీ కుటుంబసభ్యులపై దాడిచేస్తుంటే మీ కుటుబాన్ని, మిమ్మల్ని మీరు రక్షించుకోడానికి అల్లాహ్ నుంచి ప్రేరణకై నిరీక్షిస్తారా? కాని మహమ్మద్ మాత్రం తన ముస్లిం తెగను అల్లాహ్ పేరుతో కాఫీర్లు ఒక్కడు కూడా మిగలకుండా చచ్చువరకు సంహరించాలని తెగ విస్తారంగా ప్రేరేపించాడు. ఇదంతా కూడా మక్కా నుంచి బహీష్కరింపబడినందుకు ప్రతీకారచర్య కాదా?, యుద్ధకాంక్ష అసలే కాదా? ఇది ఆత్మరక్షణ కోసమేనా? ఎవరినుంచి ఆత్మరక్షణ?  
 

Wednesday 10 August 2011

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-2

అప్పట్లో మక్కావాసులు ఎంతో సహనశీలురైయుండిరి. మక్కా యొక్క ఆర్థిక సామాజిక ప్రగతి అక్కడికి వచ్చే యాత్రీకులపై అధారపడి ఉన్నప్పటికీ, ఆ యాత్రీకులను, మక్కావారిని అపహాస్యం చేస్తూ, వారి విశ్వాసాల్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తూ మహమ్మద్ 13 సంవత్సరాలు తన కొత్తమతమైన ఇస్లాంని ప్రకటించసాగాడు. దీనినిబట్టి మక్కావారు ఎంత ఓర్పుతో వ్యవహరించారో స్పష్టంగా తెలుస్తుంది.

మొదట్లో మహమ్మద్ మాటల్ని ఆయన స్నేహితులు మరియు కుటుంబసభ్యులు మాత్రమే అంగీకరించారు. పదమూడేండ్ల మతప్రచారం తరువాత మహమ్మద్ సంపాదించుకొన్న అనుచరగణం కేవలం ఒక వందమంది. వీరు ముసల్మాలనబడిరి. మహమ్మద్ భార్య (ఆమె పరివారం మరియు పనివారు) కాకుండా ఇస్లాంని స్వీకరించిన మొట్టమొదటి  వ్యక్తి అలీ (ఇతను మహమ్మద్‌కు అల్లుడవుతాడు మరియు తరువాత నాల్గవ ఖలీఫాగా ఎంచబడతాడు). ఇస్లాంను స్వీకరించిన ఇంకో ముఖ్యమైన వ్యక్తి ధనవంతుడైన అబు బాకర్ అనే వర్తకుడు. ఇతని పుణ్యమాని ముస్లిం తెగ ప్రభలింది.   

మహమ్మద్, అల్లాహ్‌తోపాటు మక్కావారి దేవుళ్ళను కూడా అంగీకరించే"సైతాను సందేశం"(Satanic Verses) అనే సంఘటన తరువాత జరిగిన కొన్ని పరిణామాలాతో మహమ్మద్‌కు మక్కావారితో సంబంధాలు చెడాయి. (సైతాను సందేశం Satanic Verses అనగా- మహమ్మద్ తమ దేవతాదేవుళ్ళను అంగీకరించాడని తెలిసి మక్కావారు సంతోషించి మహమ్మద్‌ను ఆదరించిరి. దీవివల్ల మహమ్మద్ అనుచరులు ఆయన చెప్పిన మాటల విశ్వసనీయతను ప్రశ్నించిరి. తనవారు తనపై నమ్మకం కోల్పోతున్నారని మహమ్మద్ గ్రహించి తనతో ఆ మాటలు, అనగా పాగన్లతో, ఇతరమతస్తులతో కలిసుండాలనే మాటలు సైతాను ప్రేరేపించి చెప్పించాడని వారికి సంజాయిషీ ఇచ్చి మళ్లీ మక్కావారి మతాల్ని, ఆచారాల్ని ద్వేషించడం మొదలుపెట్టాడు- తబారీ:1192; ఖురాన్ 22:52; 53:19-26; అంటే మహమ్మద్ సైతానుచే ప్రేరేపింపబడి పరమతసహనం గురించి మాట్లాడుటను Satanic Verses అందురు).    

ఈ పరిణామంతో నివ్వేరపోయిన మక్కావారు ఇంతకుమునుపుకంటె కోపోద్రికులై ముస్లింలను ఇంకెక్కువగా అవమానించారు. మక్కావారు చేసిన ఈ అవమానాలనే ముస్లింలు "భయంకరమైన చిత్రహింసలు"గా పేర్కొంటారు. అయితే ఈ "చిత్రహింసల"ను గురించి ముస్లిం చరిత్రకారులైన ఇబ్న్ ఇషాక్ మరియు అల్ తబారీ వ్రాసిన వివరాలలో కేవలం ఒక్క ముస్లిం చనిపోయినట్లుగా ఉంది. అది కూడా ఒక వృద్ధ మహిళ- ఈమె ముస్లింలకు జరుగుతున్న అవమానాలకు, అశాంతికి కలతచెంది మనోవేదనతో మృతిచెందింది (ఎవరూ భౌతికంగా గాయపరిచి చంపలేదు).    

ముస్లింమత ఆధునిక పరిరక్షకులకు (modern apologists) ఇది మింగుడుపడని విషయం. ఎందుకంటే వీరు ఎంతసేపూ మక్కావారు చిత్రహింసలకు గురిచేయబట్టే మహమ్మద్ వీరిపై దాడులు చేసాడు అని పదే పదే వాదించి తెలియనివారిని నమ్మించడానికి శతవిధాలా ప్రయత్నిస్తారు. అయితే సత్యమేంటో ముస్లిం చరిత్రకారులు వ్రాసిన చరిత్రపాఠాలను చూసి గ్రహించవచ్చు.  

{మక్కావారే మొదట కత్తిదూసారు అనేది పచ్చి అబద్ధం. ఇది ముస్లిం ప్రచారం (muslim propaganda). చెప్పాలంటే మహమ్మద్ అసలు ఏ కారణం లేకుండానే దాడిచేసిన సందర్భాలున్నాయి. వీటి గురించి తదుపరి టపాలో వివరిస్తాను.}  

Sunday 7 August 2011

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-1

ముస్లిం చరిత్రకారులు వివరించిన ప్రకారం మక్కావాసులకు మహమ్మద్ ఇస్లాం అనే కొత్తమతాన్ని పాటించడం మరియు బోధించడం వలన ఎటువంటు అభ్యంతరం కలుగలేదు. ఎప్పుడైతే మహమ్మద్ తాను మాత్రమే దేవుడైన అల్లాహ్‌చే మానవాళికి పంపబడిన నిజమైన ఆఖరి ప్రవక్తగా ప్రకటించుకొనుచూ, ఇతర మతాలను, వారి విశ్వాసాలను కించపరుస్తూ, వారి పూర్వీకులను దూషించడం, అవహేళన చేయడం మొదలుపెట్టాడో అప్పుడు మక్కా ప్రజలు అభ్యంతరపడి మహమ్మద్‌ను మందలించారు (ఇబ్న్ ఇషాక్: 167). మక్కాలోని పెద్దలు వారి ఆచారాలపై మహమ్మద్ చేస్తున్న తీవ్రమైన ఆరోపణలు, దూషణలు విని కోపోద్రికులై మహమ్మద్‌కు ఆయన పూర్వస్థితిని గుర్తుచేస్తూ గద్దించి, హేళనచేసి పిచ్చివాగుడుగా కొట్టిపారేసారు. ఎందుకంటే ఆయన స్థితికి, దేవుని ప్రవక్త అని ఇంకా ఆయన చెప్పుకొంటున్న అనేక ప్రగల్భాలకి అసలు పొంతనలేకుండా పోయింది.

"మక్కావాసులు మహమ్మద్‌ను మానసికంగా, శారీరికంగా చిత్రహింసలు పెట్టి అనేకమార్లు చంపడానికి ప్రయత్నించడం వల్లే ఆయన అక్కడనుండి మదీనాకు పారిపోయాడు" అని ముస్లింలు మహమ్మద్ మక్కావాసులు మరియు వర్తకులు ప్రయాణించేటపుడు జరిగించిన హింసాత్మక దోపిడీలు మరియు హత్యలను సమర్థించడానికి పదే పదే వక్కానించి చెబుతారు. కాని అసలు మక్కాలో మహమ్మద్ ఎంత చిత్రహింసకు గురైయ్యాడో ముస్లిం మత గ్రంథాలనుండి ముస్లిం చరిత్రకారుల వివరణల నుండి నిజం తెలుసుకొందాం: 

ముస్లిం చరిత్రకారుల ప్రకారం మక్కావాసులు మహమ్మద్ ప్రచారంచేస్తున్న ఇస్లాం అనే నూతనమతం విషయమే ఎంతో సహనంతో వ్యవహరించారు. స్వతహగా, అనేక మతాల యాత్రికులకు కేంద్రబిందువైన మక్కా ఎంతో సహనం కలిగిన ప్రాంతంగా అనాడు ప్రసిద్ధిచెందిది. క్రైస్తవులు, యూదులు, బహుదేవతారాధికులు ఇలా అనేకులు తమతమ పవిత్ర మాసాల్లో "కాబా"లో పూజలుచేయడానికి సుదూరప్రాంతాలనుండి మక్కాకి వచ్చేవారు. వీరందరు ఎంతో పరమతసహనంతో పక్కపక్కనే వారివారి ప్రార్థనలు చేసుకొనేవారు. స్థానికంగ ఉండేవారు కూడా వీరికి మంచి ఆతిథ్యమిచ్చేవారు. ఎందుకంటే యాత్రీకుల వల్ల మక్కాలో బాగా వ్యాపారం జరిగేది. ఇది వర్తకులకి కూడా ప్రథాన కేంద్రంగా ఉండేది.   

మహమ్మద్ తన కొత్తమతాన్ని 13 సంవత్సరాలపాటు ఎంత ప్రచారంచేసినా కనీసం పదుల సంఖ్యలోనైనా అందులో చేరకపోవడంతో అసహనంతో ఇతరమతాలవారిని తీవ్రపదజాలంతో దూషిస్తూ అవమానకరమైన వ్యాఖ్యలు చేసేవాడు. దీవివల్ల స్థానికులకి, ప్రయాణీకులకి అందరికి విసుగుకలిగి కోపోద్రికులై అతన్ని అదుపు చేయడానికి మందలించేవారు.
"మహమ్మద్ అల్లాహ్ తనకు కనబర్చిన ఇస్లాం గురించి ప్రచారంచేసినప్పుడు మక్కావారెవరూ ఇతనిని వ్యతిరేకించలేదుకాని వారి దేవతాదేవుళ్ళను కించపరుస్తూ మాట్లాడినపుడు అతని మాటలు ఎవరూ వినకుండా కొందరు ఎదురుతిరిగిరి. మక్కావాసులు కొందరు ఇతనిని తమ శత్రువుగా ఎంచుకొనిరి" (ఇబ్న్ ఇషాక్/హిషాం: 167).      

మహమ్మద్‌కు సమస్యలు సృష్టించవద్దని గట్టిగా చెప్పినప్పటికీ ఖాతరుచేయకుండా తన ఊరివారైన మక్కావాసులతో వ్యాజ్యాలు పెట్టుకొంటూ వారి మతాలని కించపరుస్తూ వారిని రెచ్చగొట్టి జగడాలు రేపేవాడు. 
"ఇతను (మహమ్మద్) సృష్టిస్తున్న సమస్యలు ఇంతవరకు మేమెన్నడునూ చూడలేదని మక్కావారు అనిరి. అతడు వారి జీవనవిధానం మూర్ఖమైనదనియు, వారి అచారాలు వ్యర్థమనియు, వారి పితరులను అవమానిస్తూ, సమాజంలో ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు కలుగజేస్తూ శాపనార్థాలు పెడుతూ, వారి దేవుళ్ళను కించపర్చుచుండెను" (ఇబ్న్ ఇషాక్/హిషాం: 183).

అయినప్పటికీ మక్కావారు ఇతనిపై కఠిన చర్యలు తీసుకోకుండా అప్పుడప్పుడూ హెచ్చరించి వదిలేసేవారు. ఎందుకంటే అక్కడ శాంతికి భంగం కలిగితే యాత్రికులు రావడం తగ్గి వ్యాపారాలు దెబ్బతింటాయని వారు ఆలోచించేవారు. చివరికి మహమ్మద్‌ను నిలువరించడానికి అప్పుడప్పుడూ అతనికి డబ్బు కూడా ఇచ్చేవారు.
"వారు మహమ్మద్‌తొ చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి అతనిని పిలువనంపిరి. అతడు వచ్చాక- నీకు డబ్బు కావాలని ఈ గొడవలు చేస్తుంటే నిన్ను మాలో అందరికంటే ధనవంతుడిని చేస్తాం, నీకు గొప్పవాడివి కావాలనుంటే రాకుమారునిలాగా నిన్ను గౌరవిస్తాం, ఒకవేళ అధికారం కావాలంటే మాపై రాజుగా చేస్తాం. అంతేగాని ఇలా మక్కాలో శాంతికి భంగం కలిగించకు. ఇంతవరకు నీలా మా పితరులని ఎవరూ దూషించలేదు మరియు మా విశ్వాసాల్ని అవమానించలేదు. నీకేంకావాలో చెప్పు అని అతనిని వేడుకొన్నారు" (ఇబ్న్ ఇషాక్/హిషాం: 188).   



మక్కావాసులు ఇతర మతాలతో పాటు ఇస్లాం మతం మక్కాలో ఉంటే తమకు సమస్యేమీ లేదన్నట్లుగానే వ్యవహరించారు. అయితే మహమ్మద్ యొక్క తీవ్ర పదజాలం, ఇతర మతాల సంపూర్ణనిర్మూలన అనే ఉద్దేశాలవలనే వారు ఇబ్బంది పడ్డారు. ఇస్లాంతో వారికి వైరమేమీ లేదనడానికి మరో అధారం "సైతాను వాక్యాలు" (లేక "సైతాను సందేశం' Satanic Verses)లో కనబడుతుంది. చరిత్రకారుల ప్రకారం, మక్కావాసుల విన్నపాలని, హెచ్చరికలని మహమ్మద్ కొంతకాలం వరకు (తాత్కాలికంగా) తలొగ్గి ఇతరమతాలవారి హక్కులను అంగీకరించి వారిని కించపరచడం మానేసాడు.    
"ఇది విని మక్కావాసులు సంతోషించారు. తమ దేవతాదేవుళ్ళ గురించి అతనన్న (మహమ్మద్) మాటలు వారికి సంతోషం కలిగించి అతడు చెప్పే విషయాలను కూడా విన్నారు. మహమ్మద్ మోకాళ్ళూని ఖురాన్ అధ్యాయము వల్లించి బోధించిన విష్యములయందు ముస్లింలు విశ్వాముంచి మహమ్మద్‌ను వెంబడించిరి. అక్కడకు వచ్చిన ఖురేషువారైన ముష్కరులు (అన్యమతస్తులు) కూడా మోకాళ్ళూనిరి. ఎందుకనగా మహమ్మద్ వారి దేవుళ్ళను గూర్చి అనుకూలంగా మాట్లాడనారంభించెను. ఆ మసీదంతటిలో మోకాళ్ళూనని ముస్లింగాని కాఫీర్‌గాని (అన్యమతస్తుడు గాని) ఒక్కడు కూడా లేడు. అనగా అందరూ మోకాళ్ళూనారు" (అల్ తబారి- తారిఖ్: మొదటి భాగం).    

మత విద్వేషాలు వైతొలగినందుకు మక్కావాసులు ఎంతో సంతోషించారు. వారు ముస్లింలతో పాటు కాబాలో కలిసి ప్రార్థనలు చేయుచూ నెమ్మది కలిగి సంతోషముగా జీవించసాగారు. మహమ్మద్ వారి విశ్వాసాల్ని గౌరవించినందుకు వారు ముస్లింలను గౌరవించి కాబాలో స్థానం కల్పించి అంగీకరించారు.  

అయితే దురదృష్తవశాత్తూ ఈ శాంతిసమాధానాలు, సహోదరాభావం ఎంతోకాలం నిలువలేదు. ఎందుకంటే మహమ్మద్‌ను వెంబడిస్తున్న ముసల్మాన్లు అతని పూర్వ బోధకి మరియు అతడే నిజమైన దేవుని ప్రవక్త అని ప్రకటించినదానికి ఇప్పుడు పరమతసహనమైన మాటలకి ఎటువంటి పొంతనా లేదు, ఇవి రెండూ పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి అని ప్రశ్నించారు. వారిని శాంతింపజేయడానికి మహమ్మద్ మళ్లీ ఇతరమతాల్ని దూషించడం మొదలుపెట్టాడు. ఇలా మహమ్మద్ ప్లేటు పిరాయించడంతో మక్కావాసులకి మునుపటికంటే ఎక్కువ కోపం వచ్చి తీవ్ర అసహనానికి లోనయ్యారు.