Pages

Subscribe:

Thursday 11 August 2011

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-3

మొదట రక్తం చిందించింది మక్కావారే కాబట్టి వారినుండి రక్షించుకోడానికి మహమ్మద్ పోరాడాడు అని ముస్లింలు, ముల్లాలు సమర్థించుకొంటారు. అయితే ఇది ఎంతవరకు నిజమో చరిత్రను పరిశీలిద్దాం.

ఒకసారి ముసల్మాన్లు ప్రార్థనలు చేసుకొనుచుండగా ఒక అన్యమతస్తుడు వారికి అంతరాయం కలిగిస్తున్నాడనే నెపంతో సాద్ బిన్ అబూ వఖ్ఖాస్ అనే ముస్లిం నాయకుడు అతన్ని ఒంటె దవడయముకతో కొట్టి చంపాడు. ఇస్లాం పరిరక్షణకై మొట్టమదటి హత్య ఇదే (ఇబ్న్ ఇషాక్/హిషాం:166). 

కొత్తగా ఇస్లాం మతం పుచ్చుకొన్నవారికి మతం పేరుతో ఎవరినన్నా హింసించినా తప్పించుకోవచ్చనుకొనేవారు. ఒకసారి అబూ జహ్ల్ (విగ్రహారాధికుడు) అనే మక్కా పెద్ద మహమ్మద్‌ను కించపరుస్తూ మాట్లాడాడనే నెపంతో హంజా అనే ఒక బలమైన ముస్లిం అతనిని తన విల్లుతో బలంగా కొట్టాడు. అబూ జహ్ల్ బలహీనుడగుటచే ఏమీచేయలేక ఇంటికి వెళ్లి తన దగ్గర పనిచేస్తున్న ముస్లిం సేవకులని ప్రతీకారంతో హింసించాడు. ఈ విధంగా ముస్లింలు జరిగించే హింసకు ప్రతిహింస కూడా పెరిగిపోయింది (ఇబ్న్ ఇషాక్/హిషాం:185).

తగినంత సంఖ్యా బలం పొందుకొన్నాక, ముస్లింలు మక్కావారిపై మొట్టమొదట యుద్ధం ప్రకటించారు. అయితే ఈ యుద్ధంలో ముస్లింలు ఓడిపోయి మక్కా నుండి తరిమివేయబడ్డారు. ముస్లింలు అక్కడనుండి మదీనాకు వలసపోయి స్థిరపడ్డారు. అయినా మహమ్మద్ తన ఓటమిని జీర్ణించుకోలేక మక్కావారి కారావాన్లపై తెగబడి దాడులు చేసి వారిని చంపుతూ దోపుడు సొమ్ము కొల్లగొట్టేవాడు. 

****************
మదీనాలో నివసించేటప్పుడు కూడా మక్కావారు ముస్లింలను హింసించేవారు అని ముస్లింలు మాటిమాటికి ఆరోపిస్తారు. ఇందులో ఎంతవరకు సత్యముందో పరిశీలిద్దాం: 

మహమ్మద్ తన అనుచరులతో మదీనాకు వలసవెళ్లాక (హిజ్రా) కొద్దికాలానికి అతనికి అల్లాహ్ గాబ్రియేలు దూత ద్వారా ఇచ్చిన సందేశమే ఖురాన్‌లోని రెండవ అధ్యాయం (2వ సురా). ఈ అధ్యాయంలో హింసాత్మక వచనాలు అధికంగా ఉంటాయి (ఎందుకో అర్థం చేసుకోవచ్చు- మహమ్మద్ మక్కానుంచి తరిమివేయబడ్డాడు కాబట్టి!). 2వ సురాలో ఉన్న రెచ్చగొట్టే విషయాలను కప్పిపుచ్చుకోడానికి లేక సమర్థించుకోడానికి ముస్లిం మత సమర్థకులు (muslim apologists) మదీనాలో కూడా ముస్లింలను మక్కావారు హింసించారని ఆరోపిస్తారు. 2వ అధ్యాయంలోని వచనాలు అవిశ్వాసులైన పాగన్లు, విగ్రహారాధికులు, క్రైస్తవులు మరియు యూదులు ముస్లింలపై చేసిన అక్రమాలకి, దౌర్జన్యాలకి మరియు హింసకు ప్రతిగా వారిని తుదముట్టించుటకు ప్రేరేపిస్తాయి.  వీటిని దృష్టిలో పెట్టుకొని నేటి ముస్లిం విద్వాంసులు అనాడు మదీనాలోని ముస్లింలపై అనేక దాడులు జరిగి చిత్రహింసలనుభవించారని వివరిస్తారు.  

దురదృష్టమేంటంటే మహమ్మద్ "చిత్రహింస" అని దేనిగురించి అన్నాడో ముస్లిం చరిత్రకారుల వివరణలను ఇంతకుముందే చూసాము. నేడు "హింస" అంటే భౌతికంగా, మానసికంగా సరైన కారణం లేకుండా గాయపర్చడం. మహమ్మద్ ప్రకారం "చిత్రహింస" అంటే ఆయన చెప్పింది అనుసరించకపోవడం, అతను రెచ్చగొడుతున్న మతవిద్వేషాలకు హెచ్చరించడం, యుద్ధం ప్రకటిస్తే అతనిని ఓడించి సంహరించకుండా, భౌతికంగా గాయపరచకుండా మక్కా నుంచి బహిష్కరించడం. ఈ "చిత్ర హింస"లకు ప్రతిగా అవిశ్వాసులను (కాఫీర్లను) సంహరించడం సరైన న్యాయం అని మహమ్మద్‌కు అల్లాహ్ సందేశమిచ్చాడు. (మహమ్మద్ మక్కావారి చిత్రహింసలు తాలలేక తనను తన అనుచరులను రక్షించుకోడానికి మాత్రమే కత్తి పట్టాడు- ఇది ముస్లిం సమర్థకుల వాదన). నిజానికి గమనించినట్లైతే, మక్కావారు మహమ్మద్ దాడులనుంచి తమనుతాము కాపాడుకోడానికి ప్రయత్నించారు. వారికి ఇస్లాం ఒక మతంగా మక్కాలోని కాబాలో ఉండడానికి, వారి మతప్రచారం చేసుకోడానికి ఎటువంటి అభ్యంతరం లేకపోయెను కాని కాబాలో కేవలం ఇస్లామే ఉండాలి, అన్యమతాలు వ్యర్థం అని దూషణలకు దిగినప్పుడు మాత్రమే వారు అభ్యతరం తెలిపారు.

మహమ్మద్ 2వ సురా ప్రకటించినప్పుడు వారిపై దాడులు జరిగినట్లు ఏ చరిత్రకారుడూ తెలుపలేదు. వారిపై సైన్యాలు దండెత్తి రావడం కాని లేక అటువంటి ప్రయత్నాలు ఎవరైనా చేసినట్లుగాని ఎటువంటి అధారాలు లేవు. మదీనాపై మక్కావారి ప్రభావం ఎంతమాత్రము లేకుండెను. ముస్లింలు ఆరోపించినట్లు ఆనాడు వారిపై మదీనాలో ఎటువంటి హింసా లేక దాడి జరుగలేదు. "సీరా (biography)"లో వివరింపబడిన ప్రకారం తమపై యుద్ధం ప్రకటించి బహీష్కరణకు గురైన మహమ్మద్‌నకు హాని చేసే ఉద్దేశం మక్కావారికి ఎంతమాత్రం లేదు. 

అసలు ముస్లింలపై నిరంతరం దాడులు జరిగినట్లైతే వారిని పదే పదే యుద్ధానికి ప్రేరేపించాల్సిన అవసరం ఎందుకు? ఉదాహరణకు, ఎవరైనా మీ ఇంట్లోకి చొరబడి మీ కుటుంబసభ్యులపై దాడిచేస్తుంటే మీ కుటుబాన్ని, మిమ్మల్ని మీరు రక్షించుకోడానికి అల్లాహ్ నుంచి ప్రేరణకై నిరీక్షిస్తారా? కాని మహమ్మద్ మాత్రం తన ముస్లిం తెగను అల్లాహ్ పేరుతో కాఫీర్లు ఒక్కడు కూడా మిగలకుండా చచ్చువరకు సంహరించాలని తెగ విస్తారంగా ప్రేరేపించాడు. ఇదంతా కూడా మక్కా నుంచి బహీష్కరింపబడినందుకు ప్రతీకారచర్య కాదా?, యుద్ధకాంక్ష అసలే కాదా? ఇది ఆత్మరక్షణ కోసమేనా? ఎవరినుంచి ఆత్మరక్షణ?  
 

4 comments:

Unknown said...

hllo.. mister gorrela manda gaaru......... nuvvu sekarinchina samachaaram xxxxxlant but ithara mathastula manobavaalu debbatinetlu rayaku... pleas its a delicate matter if it is spread allover world it may create new sense, and uncertain situation between major religions.....

Carpenter's Son said...

ఎవరి మనోభావాలో దెబ్బతీయడానికి నేను సొంత దూషణలు, కల్పించిన ఆరోపణలు చేయట్లేదు. వారి మత గ్రంథాలు, రచనలలో పేర్కొనబడిన విషయాలను మాత్రమే వ్రాస్తున్నాను. ప్రపంచమంతా ఎప్పుడో న్యూసెన్స్ క్రియేట్ అయ్యింది, అవుతూవుంది, ఇంక కొత్తగా అవ్వాల్సింది ఏమీ లేదు.

kosuru said...

Do you also write about christianity?

Carpenter's Son said...

what do you expect me to write about Christianity?

-Before you reply to my question, please read through:
1) this is not a hate-mongering, islamophobic blog.
2) this blog is not against muslims but the fascist, totalitarian ideology of islam.
3) muslim people are just like you and me as long as they are not brainwashed and obsessed by this ideology.
4) no other religion except islam advocates complete annihilation of people who do not believe in it. and the most pathetic and unfortunate fact is that it's a timeless command.
5) i don't have any problem with other religious ideologies but it does not mean that all the people of other religions are good.
6) what troubles me most is, in islam people commit atrocities because islam says so unlike other people who do bad by themselves (not a religious obligation). in other words, for muslims, it's a religious obligation to persicute and kill non-muslims.
7) and lastly, christianity is good, as it does not advocate killing non-christians, but it does not imply that all people who call themselves as christians are good, like hinduism is good, but not all hindu people etc.
The problem with islam is islam itself. hence i chose to write about it.
8) religious fanaticism exists in all religions, but in islam it's official, directly commanded by their "prophet" muhammad, and "god" allah in their "holy" quran!

Post a Comment