Pages

Subscribe:

Sunday 7 August 2011

మహమ్మద్ జీవితం: మక్కాలో హింసింపబడుట-1

ముస్లిం చరిత్రకారులు వివరించిన ప్రకారం మక్కావాసులకు మహమ్మద్ ఇస్లాం అనే కొత్తమతాన్ని పాటించడం మరియు బోధించడం వలన ఎటువంటు అభ్యంతరం కలుగలేదు. ఎప్పుడైతే మహమ్మద్ తాను మాత్రమే దేవుడైన అల్లాహ్‌చే మానవాళికి పంపబడిన నిజమైన ఆఖరి ప్రవక్తగా ప్రకటించుకొనుచూ, ఇతర మతాలను, వారి విశ్వాసాలను కించపరుస్తూ, వారి పూర్వీకులను దూషించడం, అవహేళన చేయడం మొదలుపెట్టాడో అప్పుడు మక్కా ప్రజలు అభ్యంతరపడి మహమ్మద్‌ను మందలించారు (ఇబ్న్ ఇషాక్: 167). మక్కాలోని పెద్దలు వారి ఆచారాలపై మహమ్మద్ చేస్తున్న తీవ్రమైన ఆరోపణలు, దూషణలు విని కోపోద్రికులై మహమ్మద్‌కు ఆయన పూర్వస్థితిని గుర్తుచేస్తూ గద్దించి, హేళనచేసి పిచ్చివాగుడుగా కొట్టిపారేసారు. ఎందుకంటే ఆయన స్థితికి, దేవుని ప్రవక్త అని ఇంకా ఆయన చెప్పుకొంటున్న అనేక ప్రగల్భాలకి అసలు పొంతనలేకుండా పోయింది.

"మక్కావాసులు మహమ్మద్‌ను మానసికంగా, శారీరికంగా చిత్రహింసలు పెట్టి అనేకమార్లు చంపడానికి ప్రయత్నించడం వల్లే ఆయన అక్కడనుండి మదీనాకు పారిపోయాడు" అని ముస్లింలు మహమ్మద్ మక్కావాసులు మరియు వర్తకులు ప్రయాణించేటపుడు జరిగించిన హింసాత్మక దోపిడీలు మరియు హత్యలను సమర్థించడానికి పదే పదే వక్కానించి చెబుతారు. కాని అసలు మక్కాలో మహమ్మద్ ఎంత చిత్రహింసకు గురైయ్యాడో ముస్లిం మత గ్రంథాలనుండి ముస్లిం చరిత్రకారుల వివరణల నుండి నిజం తెలుసుకొందాం: 

ముస్లిం చరిత్రకారుల ప్రకారం మక్కావాసులు మహమ్మద్ ప్రచారంచేస్తున్న ఇస్లాం అనే నూతనమతం విషయమే ఎంతో సహనంతో వ్యవహరించారు. స్వతహగా, అనేక మతాల యాత్రికులకు కేంద్రబిందువైన మక్కా ఎంతో సహనం కలిగిన ప్రాంతంగా అనాడు ప్రసిద్ధిచెందిది. క్రైస్తవులు, యూదులు, బహుదేవతారాధికులు ఇలా అనేకులు తమతమ పవిత్ర మాసాల్లో "కాబా"లో పూజలుచేయడానికి సుదూరప్రాంతాలనుండి మక్కాకి వచ్చేవారు. వీరందరు ఎంతో పరమతసహనంతో పక్కపక్కనే వారివారి ప్రార్థనలు చేసుకొనేవారు. స్థానికంగ ఉండేవారు కూడా వీరికి మంచి ఆతిథ్యమిచ్చేవారు. ఎందుకంటే యాత్రీకుల వల్ల మక్కాలో బాగా వ్యాపారం జరిగేది. ఇది వర్తకులకి కూడా ప్రథాన కేంద్రంగా ఉండేది.   

మహమ్మద్ తన కొత్తమతాన్ని 13 సంవత్సరాలపాటు ఎంత ప్రచారంచేసినా కనీసం పదుల సంఖ్యలోనైనా అందులో చేరకపోవడంతో అసహనంతో ఇతరమతాలవారిని తీవ్రపదజాలంతో దూషిస్తూ అవమానకరమైన వ్యాఖ్యలు చేసేవాడు. దీవివల్ల స్థానికులకి, ప్రయాణీకులకి అందరికి విసుగుకలిగి కోపోద్రికులై అతన్ని అదుపు చేయడానికి మందలించేవారు.
"మహమ్మద్ అల్లాహ్ తనకు కనబర్చిన ఇస్లాం గురించి ప్రచారంచేసినప్పుడు మక్కావారెవరూ ఇతనిని వ్యతిరేకించలేదుకాని వారి దేవతాదేవుళ్ళను కించపరుస్తూ మాట్లాడినపుడు అతని మాటలు ఎవరూ వినకుండా కొందరు ఎదురుతిరిగిరి. మక్కావాసులు కొందరు ఇతనిని తమ శత్రువుగా ఎంచుకొనిరి" (ఇబ్న్ ఇషాక్/హిషాం: 167).      

మహమ్మద్‌కు సమస్యలు సృష్టించవద్దని గట్టిగా చెప్పినప్పటికీ ఖాతరుచేయకుండా తన ఊరివారైన మక్కావాసులతో వ్యాజ్యాలు పెట్టుకొంటూ వారి మతాలని కించపరుస్తూ వారిని రెచ్చగొట్టి జగడాలు రేపేవాడు. 
"ఇతను (మహమ్మద్) సృష్టిస్తున్న సమస్యలు ఇంతవరకు మేమెన్నడునూ చూడలేదని మక్కావారు అనిరి. అతడు వారి జీవనవిధానం మూర్ఖమైనదనియు, వారి అచారాలు వ్యర్థమనియు, వారి పితరులను అవమానిస్తూ, సమాజంలో ఒకరి మధ్య ఒకరికి మనస్పర్థలు కలుగజేస్తూ శాపనార్థాలు పెడుతూ, వారి దేవుళ్ళను కించపర్చుచుండెను" (ఇబ్న్ ఇషాక్/హిషాం: 183).

అయినప్పటికీ మక్కావారు ఇతనిపై కఠిన చర్యలు తీసుకోకుండా అప్పుడప్పుడూ హెచ్చరించి వదిలేసేవారు. ఎందుకంటే అక్కడ శాంతికి భంగం కలిగితే యాత్రికులు రావడం తగ్గి వ్యాపారాలు దెబ్బతింటాయని వారు ఆలోచించేవారు. చివరికి మహమ్మద్‌ను నిలువరించడానికి అప్పుడప్పుడూ అతనికి డబ్బు కూడా ఇచ్చేవారు.
"వారు మహమ్మద్‌తొ చర్చించి సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి అతనిని పిలువనంపిరి. అతడు వచ్చాక- నీకు డబ్బు కావాలని ఈ గొడవలు చేస్తుంటే నిన్ను మాలో అందరికంటే ధనవంతుడిని చేస్తాం, నీకు గొప్పవాడివి కావాలనుంటే రాకుమారునిలాగా నిన్ను గౌరవిస్తాం, ఒకవేళ అధికారం కావాలంటే మాపై రాజుగా చేస్తాం. అంతేగాని ఇలా మక్కాలో శాంతికి భంగం కలిగించకు. ఇంతవరకు నీలా మా పితరులని ఎవరూ దూషించలేదు మరియు మా విశ్వాసాల్ని అవమానించలేదు. నీకేంకావాలో చెప్పు అని అతనిని వేడుకొన్నారు" (ఇబ్న్ ఇషాక్/హిషాం: 188).   



మక్కావాసులు ఇతర మతాలతో పాటు ఇస్లాం మతం మక్కాలో ఉంటే తమకు సమస్యేమీ లేదన్నట్లుగానే వ్యవహరించారు. అయితే మహమ్మద్ యొక్క తీవ్ర పదజాలం, ఇతర మతాల సంపూర్ణనిర్మూలన అనే ఉద్దేశాలవలనే వారు ఇబ్బంది పడ్డారు. ఇస్లాంతో వారికి వైరమేమీ లేదనడానికి మరో అధారం "సైతాను వాక్యాలు" (లేక "సైతాను సందేశం' Satanic Verses)లో కనబడుతుంది. చరిత్రకారుల ప్రకారం, మక్కావాసుల విన్నపాలని, హెచ్చరికలని మహమ్మద్ కొంతకాలం వరకు (తాత్కాలికంగా) తలొగ్గి ఇతరమతాలవారి హక్కులను అంగీకరించి వారిని కించపరచడం మానేసాడు.    
"ఇది విని మక్కావాసులు సంతోషించారు. తమ దేవతాదేవుళ్ళ గురించి అతనన్న (మహమ్మద్) మాటలు వారికి సంతోషం కలిగించి అతడు చెప్పే విషయాలను కూడా విన్నారు. మహమ్మద్ మోకాళ్ళూని ఖురాన్ అధ్యాయము వల్లించి బోధించిన విష్యములయందు ముస్లింలు విశ్వాముంచి మహమ్మద్‌ను వెంబడించిరి. అక్కడకు వచ్చిన ఖురేషువారైన ముష్కరులు (అన్యమతస్తులు) కూడా మోకాళ్ళూనిరి. ఎందుకనగా మహమ్మద్ వారి దేవుళ్ళను గూర్చి అనుకూలంగా మాట్లాడనారంభించెను. ఆ మసీదంతటిలో మోకాళ్ళూనని ముస్లింగాని కాఫీర్‌గాని (అన్యమతస్తుడు గాని) ఒక్కడు కూడా లేడు. అనగా అందరూ మోకాళ్ళూనారు" (అల్ తబారి- తారిఖ్: మొదటి భాగం).    

మత విద్వేషాలు వైతొలగినందుకు మక్కావాసులు ఎంతో సంతోషించారు. వారు ముస్లింలతో పాటు కాబాలో కలిసి ప్రార్థనలు చేయుచూ నెమ్మది కలిగి సంతోషముగా జీవించసాగారు. మహమ్మద్ వారి విశ్వాసాల్ని గౌరవించినందుకు వారు ముస్లింలను గౌరవించి కాబాలో స్థానం కల్పించి అంగీకరించారు.  

అయితే దురదృష్తవశాత్తూ ఈ శాంతిసమాధానాలు, సహోదరాభావం ఎంతోకాలం నిలువలేదు. ఎందుకంటే మహమ్మద్‌ను వెంబడిస్తున్న ముసల్మాన్లు అతని పూర్వ బోధకి మరియు అతడే నిజమైన దేవుని ప్రవక్త అని ప్రకటించినదానికి ఇప్పుడు పరమతసహనమైన మాటలకి ఎటువంటి పొంతనా లేదు, ఇవి రెండూ పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి అని ప్రశ్నించారు. వారిని శాంతింపజేయడానికి మహమ్మద్ మళ్లీ ఇతరమతాల్ని దూషించడం మొదలుపెట్టాడు. ఇలా మహమ్మద్ ప్లేటు పిరాయించడంతో మక్కావాసులకి మునుపటికంటే ఎక్కువ కోపం వచ్చి తీవ్ర అసహనానికి లోనయ్యారు.        

No comments:

Post a Comment