Pages

Subscribe:

Saturday 23 July 2011

దేవుడున్నాడా?-5

యెస్లింగ్ వ్యాసాన్ని చదివి అనేకులు Skeptical Inquirer పత్రికకు ఉత్తరాలు వ్రాసారు. వాటికి యెస్లింగ్ సమాధానాలిచ్చారు. ఈ ఉత్తరప్రత్యుత్తరాల్ని 1995లో ఆ పత్రికలో ప్రచురించారు. యెస్లింగ్ ఒకచోట ఇలా వ్రాసారు: "సైన్స్ కూడా ఒక ఊహతోనే మొదలవుతుంది. మనం ఊహించిన ఆలోచన నిజమా కాదా అని నిర్ధారించుకోడానికి అనుభవపూర్వకమైన సాక్ష్యం కావాలి. నేటి వరకు మన కంటికి కనిపించే మరియు దృష్టికి అతీతంగా విశాలంగా ఉన్న విశ్వం శూన్యం లోనుండి జన్మించినట్లు కనీస సాక్షాధారాలు లేవు. కాబట్టి రాతిలో దేవుడున్నాడు అనేది ఎంత మూఢనమ్మకమో ఇదీ అంతేకాని ఏమాత్రం విజ్ఞానం కాదు (1995)".

యెస్లింగ్ చెప్పింది నేటి (2011) వరకు నిజమే. పదార్థం శూన్యంలో నుండి ఉత్పన్నమవడం అసాధ్యం. ఏ ప్రయోగశాలలోనూ ఇది నిరూపించబడలేదు, నిరూపించబడనేరదు కూడా! ఇది 1st & 2nd Law of Thermodynamicsకి పూర్తి విరుద్ధమైన సిద్ధాంతం.  

ఏదైనా విషయం గమనించబడగలిగి తిరిగి రూపొందించగలిగినదైతే అది నికార్సైన విజ్ఞామవుతుంది. అంతేగాని ఏదో ఊహించి దాన్ని రుజువుచేయకుండానే ప్రామాణికంగా పరిగణించి దానిని అబివృద్ధి చేస్తే అది ఎంత బావున్నా విజ్ఞానం కానేరదు. ప్రయోగాత్మకంగా నిరూపించబడగలిగినదే సైన్స్.

సుప్రసిద్ధ ఖగోళ-భౌతిక శాస్త్రవేత్తైన స్టీఫెన్ హాకింగ్ ఇలా అన్నాడు: విశ్వం తనంతటతాను శూన్యంలోనుండి ఉత్పత్తిగావించుకొన్నది అని చెప్పే The new inflationary model విఫలమైనది. ఇది వైజ్ఞానికంగా తాత్వికంగా నిజంకాదు. అయినా ఇదే నిజమనే భ్రమలో కొందరు ఇంకా దీనిపై వ్యాసాలు వ్రాస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు.  

1 comment:

rajasekhar Dasari said...

చాలా బాగుంది . మీరు వివరించిన విధానము స్పష్తముగా అర్ధం ఐనది. ఈ బ్లాగ్ని ఇలాగే కొనసాగించండి .


రాజశేఖర్ దాసరి

Post a Comment