Pages

Subscribe:

Saturday 30 July 2011

భారతీయ బానిస వ్యాపారం-4

ఫంజాబ్‌ను ఆక్రమించుకొన్న ఆఫ్గానిస్తాన్‌లోని గజినీ ప్రాంతవాసులైన గజినివిద్ తుర్కలు (Ghaznivid-Turks) (క్రీ.శ. 997-1206)

మొహమద్ గజినీ (997-1030) 17సార్లు హిందూస్థాన్‌పై దండెత్తి ఎంతో దోపుడు సొమ్ము తీసుకుపోయాడు అంతేగాక ఆయన చంపినవారు మరియు బంధిపబడి ఆఫ్గానిస్థాన్‌లోని గజినీ పట్టణానికి బానిసలుగా తీసుకుపోబడినవారు సుమారు 20లక్షలమంది (ఖాన్:315వ పుట). ఉదాహరణకు సుల్తాన్‌యొక్క కార్యదర్శి మరియు గణాంకుడైన ఉత్బీ,
సుల్తాన్ చరిత్ర గ్రంథంలో వ్రాసిన లెక్కలు-......తానేసర్‌నుండి ముస్లిం సైన్యాలు 2,00,000 మందిని గజినీ పట్టణానికి చెరపట్టుకొచ్చారు.......1019లో 53,000 మంది బానిసల్ని కొత్తగా బంధించి తెచ్చారు........ఇంకోసారి కాలిఫ్ కు దక్కవలసిన ఐదవవంతు బానిసలు 1,50,000 మంది (అంటే మొత్తం బానిసల సంఖ్య 7,50,000 మంది)....... తూర్పునుండి 5,00,000 బానిసలను ముస్లిం సైన్యం తీసుకువొచ్చింది..... 
ఇంకా మొహమద్ గజినీ కార్యదర్శియైన అల్-ఉత్బీ ఇలా వివరించాడు:
"దేవుని సైన్యమైన ముసల్‌మాన్‌లు 15,000 మందిని ఊచకోత కోసారు. వారి ఖడ్గాలు కారుమేఘాల్నుంచి వెలువడుతున్న మెరుపులవలే కదలసాగాయి, నేలరాలిన తోకచుక్కలా విగ్రహారాదికుల రక్తం ఏరులైపారింది. అంతేగాక అనంతమైన సంపద, 5,00,000 మంది అందమైన స్త్రీలు, పురుషులు బానిసలుగా ముస్లిం సైన్యానికి చిక్కారు (ఖాన్: 191)."

గజినివిద్‌లు ఇస్లాం సుల్తాన్ రాజపీఠమైన పంజాబ్‌లో 1186 వరకు ఏలారు. కాశ్మీర్, హన్సి మరియు పంజాబ్‌లో అనేక ప్రాంతాల్లో వీరు భయంకర నరమేదాలు చేసారు. ఎంతోమందిని బానిసలుగా చేసుకొన్నారు. ఉదాహరణకు 1079లో జరిగిన ఒక్క దాడిలోనే సుమారు 1,00,000 మందిని చెరపట్టి బానిసలుగా చేసారు (తారీక్-ఈ-అల్ఫీ, "ఖాన్" 276వ పేజీలో).   

2 comments:

Anonymous said...

ఫార్మటింగ్ లో మీ బ్లాగు మిగతవారి బ్లాగులగా లేదు. దాని సరి చేసేది. ఈ రోజు ఒక బ్లాగు చదువుతుంటే ముస్లిం రాజులు మగ వారిని కొజ్జాలు గా మార్చి వారిని అరబ్బుదేశాలకు ఎగుమతి చేసేవారని చదువాను. అలా చేయటానికి గల చారిత్రాత్మక కారణాలు ఎమైనా ఉన్నాయ? హిందూ రాజులు కూడా ఇలా ఎవరినైనా చేశారా?

sunny said...

సాంబశివుడు గారు, ఫార్మాటింగ్ ఎలా చేయాలో హేల్ప్‌చేయండి. నాకంత బాగా తెలియదు.
ఇక రెండో విషయం, రాణులకు, ఉపపత్నులకు కాపలా ఉండడానికి కొందరు హిందూ రాజులు (ఆ మాటకొస్తే, అన్ని సంస్కృతుల్లోను ఇది జరిగేది) కూడా కొందరు పురుషులని నపుంసకులనుగా మార్చేవారు. ఐతే ఈ సంఖ్య చాలా తక్కువ మరియు ఇది వ్యక్తిగతం (రాజునిబట్టి). కాని, ముస్లిం రాజులు కొన్ని వేల సంఖ్యలో పురుషులని, అందమైన యువకుల్ని, బాలురని నపుంసకులనుగా మార్చేవారు. వీరికి ఇది వారి మతపరమైన విధి. కాబట్టి ప్రతీ ముస్లిం రాజు అన్యుల మీద, విగ్రహారాదికుల మీద, వారి "మతధర్మం(???)"గా ఈ అగాయిత్యాలు చేసేవారు. ఈ నపుంసకులని కాపలాకు, ఇతరపనులకేగాక వారి కామవాంఛలు తీర్చుకోడానికి వినియోగించుకొనేవారు.

Post a Comment