Pages

Subscribe:

Monday 18 July 2011

దేవుడున్నాడా?-2

కారణకార్యములు- విశ్వశాస్త్ర తర్కం

ఈ విశ్వం, అనగా మనము ఉన్న ఈ లోకం, జీవరాశి, అనంత ఆకాశం మనముందున్నవి. ఇవి ఏలాగు సంభవించినవో తెలుసుకోవాలి- మానవ చరిత్రలో అనాదిగానున్న తర్కమిది. R. C. Sproul తన NOT A CHANCE అనే పుస్తకంలో ఇట్లు విశదపరచారు.
"కారణం లేకుండా ఏదీ సంభవించదు కాబట్టి దేవుడున్నాడు అనేది సాంప్రదాయ ఆస్తిక వాదన. అనగా, ఈ విశ్వం సంభవించినది కాబట్టి సంభవింపజేసినవాడు ఉండాలి, అతడే కర్త లేక దేవుడైయున్నాడు. శూన్యము గాక ఎదోఒకటి ఉన్నది గనుక దానికి సరైన సమాధానం కర్తయే అనునది సాంప్రదాయ వాదం."

విశ్వం యొక్క ఉనికి సత్యం- విశ్వం ఉనికి కలిగి ఉండటమేకాదు అది బ్రహ్మండమైన వైవిధ్యంతో కూడికొనియున్నదని నాస్తికులు, ప్రత్యక్షవాదులు అంగీకరిస్తారు. ఒక పదార్థం తన అస్తిత్వాన్ని వివరింపలేక పోయిన యెడల అది అనిశ్చితమైన పదార్థంగా పరిగణించబడును. కాబట్టి విశ్వం కూడా ఒక అనిశ్చితమైన పదార్థమే- ఎందుకంటే అది తనని తాను సృష్టించుకోలేదు లేక దాని అస్తిత్వానికి సరైన కారణములను సూచింపలేదు. (NOTE: Big Bang Theory is just a theory which does not have any experimental proof yet. It is an assumption and is not any better or superior idea than a mere belief. Desperate attempts made by so-called scientists to prove Big Bang Theory have been utter failures). తన ఉనికిని నిర్వచింపలేని పదార్థం సంభవించడానికి కారణం తప్పక ఉండాలి. కాబట్టి ఈ విశ్వం సంభవించిన కార్యమునకు కారణం ఏమిటి లేక ఎవరు అనేది మనముందున్న ప్రశ్న!

దీని మూలంగానే కారణకార్య సింద్ధాంతం (Law of Cause and Effect) విశ్వశాస్త్ర తర్కంతో ముడిపడియున్నది. ఒక పదార్థం సంభవించుటకు మునుపు దాని అస్తిత్వం ఏర్పడుటకు ఒక కారణం ఉంటుంది అనేది Law of Cause and Effect. ఇంతకుమునుపు Law of Excluded Middle ఏలాగు రూఢియైయున్నదో ఇదీ ఆలాగే సత్యమైయున్నది. ఉదాహరణకు, ఒక ప్రాచీన కోట ఉన్నదనుకోండి. అది మనము గమనించగలిగిన విషయం కనుక దానిని కట్టినవానిని చూడకపోయినను ఉండెనని కోట ఉనికినిబట్టి రూఢిగా మనకు తెలుసు. అంతేకాని కోట మరేదో రీతిగా సంభవించింది అని అనుకోము. Sproul దీనిని గూర్చి ఇట్లు చెప్పుచున్నాడు.

"కారణము, కార్యము రెండూ వేరైనప్పటికీ తార్కిక విశ్లేషణలో ఇవి విడదీయజాలనివి. ఒక త్రిభుజానికి మూడు కోణాలున్నట్లు, లేక బ్రహ్మచారి అంటే పెండ్లి కానివాడు అను వాక్యములు ఎంత సత్యమో, కార్యమునకు కారణము అంతే సత్యం. అకారణముగా కార్యము సంభవించుట లేక కార్యము దాల్చలేని కారణముండుట అనునవి నిరర్థకమైనవి, ఏ తర్కానికి సరిపోనివి. కార్యము సంభవించుటకు కారణమవశ్యము మరియు కారణముంటే కార్యము తప్పక జరుగును!

సరిపడని కారణం లేకుండా సంభవించిన కార్యములు లేవు. అలాగే కారణమనునది కార్యము తరువాత వచ్చుట అసంబద్ధం. కార్యము కారణముకంటే ఎన్నడును శ్రేష్ఠమైనది కాదు. కారణకార్య సిద్ధాంతమునకు (Law of cause and effect) ఈ ప్రమాణాలు అవశ్యం. ఉదాహరణకు, కప్ప గెంతటం వల్ల నది బురదమయం కాదు; ఈగ వాలడం వలన పుస్తకం టేబుల్ పైనుండి కిందపడిపోదు- ఇవి సరైన కారణాలు కాదు. కాబట్టి ఒక కార్యమునకు సరియైన కారణము తెలుసుకోవాలి. ఇది మన ప్రశ్నను పునరావృత్తం చేస్తోంది- ఈ విశ్వం సంభవించుటకు కారణమేమిటి లేక ఎవరు?

దీనికి మూడు సమాధానాలు సాధ్యముగానున్నవి. 1) విశ్వం నిత్యమైనది లేక ఆద్యంతరహితమైనది; దాని ఉనికి ఎన్నటినుంచో ఉండెను, ఇకను ఎన్నటికీ ఉండును. 2) విశ్వం నిత్యమైనది కాదు; అది తననుతానే శూన్యమునుండి సృష్టించుకొన్నది. 3) విశ్వం నిత్యమైనది కాదు మరియు తనని తాను శూన్యమునుండి సృష్టించుకోలేదు; కానీ, దానికి బాహ్యంగానున్న, దానికంటే శ్రేష్ఠమైన దానిచే (లేక వానిచే) సృజింపబడినది. తప్పకుండా ఈ మూడింట్లో ఏదో ఒకటి మన సమాధానమైయున్నది. వీటిని జాగ్రత్తగా పరిశీలిద్దాం.

No comments:

Post a Comment