Pages

Subscribe:

Wednesday 20 July 2011

దేవుడున్నాడా?-3

1. విశ్వం ఆద్యంతరహితమైనదా?  (విశ్వం స్వయంభువా?)

దేవుడు లేడని వాదించే నాస్తికుడికి "విశ్వం ఆద్యంతరహితమైనది" అనే దృక్పదం కలిగి ఉండటం ఇష్టం, ఎందుకంటే విశ్వానికి ఆరంభం-ముగింపు అనే ప్రస్తావనే లేదు కాబట్టి ఎవరు ఆరంభించారనే ప్రశ్నే తలెత్తదు. దేవుడులేడని చెప్పడానికే జీవపరిణామవాదులైన (evolutionists) Thomas Gold, Hermann Bondi, మరియు Fred Hoyle అనువారు Steady State Theoryని అబివృద్ధి చేసిరి. విశ్వం రోజు రోజుకి వ్యాప్తి చెందుతొంది. దీనికి కారణం విశ్వ విశాలంలో irtrons అనే కేంద్రాలలో శూన్యములోనుండి బయటకు వస్తున్న హైడ్రోజన్ అణువులు విస్తరించడం వలననే అని ఈ శాస్త్రఙులు ప్రతిపాదించిరి. ఈ హైడ్రోజన్ అణువులు ప్రాథమిక మేఘాలుగా మారి అందులో నూతన పాలపుంతలు, నక్షత్రాలు రూపుదిద్దుకొంటాయని Dr. Hoyle ప్రతిపాదించారు. 

అయితే ఈ Steady State Theory, శక్తిని నూతనంగా సృష్తించడం లేక నాశనంచేయడం అసంభవం అని సూచించే First law of Thermodynamicsకి విరుద్ధంగా ఉండటంతో చాలా వరకు విఫలమైనది. ఖగోలశాస్త్రఙుడైన Robert Jastrow పరిశీలించినదేమనగా:

"పదార్థాన్ని శక్తిగా లేక శక్తిని పదార్థంగా మార్చవచ్చుగాని, శూన్యం నుండి పదార్థాన్ని సృష్టించడం అసాధ్యం. విశ్వంలో ఉన్న పదార్థం మరియు శక్తి ఎప్పటికి స్థిరం. ఈ నియమాన్ని పాటించని ఏ సిద్ధాంతాన్ని ఒప్పుకొనలేము."

కాబట్టి చరిత్రలో Steady State Theory పనికిరాని చెత్తలా అయ్యింది. అయినప్పటికీ ఎదో ప్రత్యామ్నాయం దొరక్కపోతుందా అని, విశ్వం నిత్యమైనది అని భావించేవారికి అది 2nd Law of Thermodynamicsకి కూడా విరుద్ధమే అగుటవలన ఇంకా సమస్యలు పెరిగాయి. 2nd Law ప్రకారం శక్తిని ఖర్చుచేసినప్పుడు లేక వాడినప్పుడు అది వాడుటకు వీలులేని స్థితిలోకి మారుతుంది. వాస్తవానికి విశ్వం విస్తరించడం క్షీణించుతోంది, ఎందుకంటే శక్తి ఖర్చవడం వలన, విస్తరించడానికి కావల్సిన శక్తి తగ్గిపోతూ ఉంది. అంటే విశ్వం విస్తరించే వేగం నానాటికీ తగ్గిపోతూంది. మున్ముందు ఇక విస్తరించడం ఆగిపోవొచ్చు (శక్తి అంతా ఖర్చైపోతుంది కాబట్టి).

ఇప్పుడున్న ఆధారాలను బట్టి విశ్వం నిత్యమైనది అనటం సమంజసంకాదు. విశ్వానికి తప్పకుండా ఒక ప్రారంభ గడియ ఉన్నది అని Jastrow అభిప్రాయం. ఇది సరైన అభిప్రాయమే! ఎందుకంటే నిత్యత్వంగలవి క్షీణించుకుపోవు, కాని విశ్వం క్షీణిస్తోంది. Henry Morisగారన్నట్లు, 2nd Law of Thermodynamics ప్రకారం విశ్వానికి ఒక ఆరంభం తప్పక ఉన్నది, అంతేకాని శాస్తవేత్తల ప్రతిపాదనైన- విశ్వం నిత్యత్వం గలది- అనునది ఆ విజ్ఞాన శాస్త్రం ప్రకారమే తప్పు!   

No comments:

Post a Comment