Pages

Subscribe:

Saturday 23 July 2011

దేవుడున్నాడా?-4

2. విశ్వం శూన్యంలోనుండి తననుతాను సృష్టించుకుందా?

విశ్వం స్వయంసృష్టి చేసుకుంది అని చెప్పే శాస్త్రఙులు ఇంతకుమునుపు లేరు. భౌతికశాస్త్రవేత్తైన జార్జ్ డేవీస్, "మనకున్న పరిజ్ఞానాన్నిబట్టి ఏ పదార్థం స్వయంసృష్టి చేసుకోజాలదు అనే విషయం స్పష్టమగుచున్నది" (1958) అని చెప్పారు. కాబట్టి విశ్వం సృష్టింపబడినదేకాని సృష్టికర్త కాదు.

అయినప్పటికీ, ఆశ్చర్యకరంగా కొందరు విఙానులు మరియు తత్వవేత్తలు విశ్వం స్వయంసృజన చేసుకోగలదనే వాదనను బలపర్చడానికి ముందుకొచ్చారు. ఉదాహరణకు, సిటీ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ లో భౌతికశాస్త్రంలో ప్రొఫెస్సరైన Edward, P. Tryonగారు,"భౌతికశాస్త్ర నియమాలకు లోబడి విశ్వం స్వయంసృష్టి గావించుకుంది అని నేను 1973లో ప్రకటించాను. అయితే ఇది జనానికి ప్రకృతివిరుద్ధమైన, విస్మయకరమైన ప్రకటనగా తోచింది (1984). అయితే మే 1984లో "సైంటిఫిక్ అమెరికన్" అనే వైఙానిక పత్రికలో ప్రచురించిన "The Inflationary Universe"అనే వ్యాసం అనేకులు విశ్వం స్వయముత్పత్తి గావించుకొన్నది అని ఒప్పుకొనుటకు దోహదపడింది. జీవపరిణామవాదులైన (Evolutionists) అలెన్ గుత్ మరియు పాల్ స్టైన్-హర్డ్ ఇలా వ్రాసారు:



"చారిత్రిక నేపధ్యంలో సంచలనాత్మకమైన విషయం ఏమిటంటే విశ్వం ఒక నిగూఢమైన, అతిసూక్ష్మమైన మర్మ ప్రదేశంలోని శూన్యం నుండి ఒక్కసారిగా దానికదే స్వీయోత్పత్తి చెంది కాంతికంటే వేగంగా శూన్యంలోకి విస్తరించుటనారంభించింది. విశ్వావిర్భవానికి ఇంతకంటే మెరుగైన వైజ్ఞానిక వివరణలేదు (1984)." 


అయితే ట్రైయాన్, గుత్, స్టైన్-హర్డ్ మరియు ఇంకొందరి ఇలాంటి ప్రకటనలు, వైజ్ఞానిక రచనలు సైంటిఫిక్ కమ్యూనిటీలో వివాదాస్పదమైన చర్చకు దారితీసాయి. ప్రముఖ సైన్స్ పత్రికలలో, వేదికలపై విశ్వం స్వీయోత్పత్తి చేసుకొందనే దృక్పథానికి బాగా ప్రాచుర్యం కల్పించారు. కొందరు ఈ సిద్ధాంతాన్ని బలంగా వ్యతిరేకించారు. ఉదాహరణకు, 1994 సమ్మర్ ఎడిషన్ Skeptical Enquirerలో బ్రిటీషువాడైన రాల్ఫ్ యెస్లింగ్ విశ్వం యొక్క స్వీయోత్పత్తి అనే అంశాన్ని విమర్శిస్తూ ఇలా చురకలంటించాడు: 

"సైంటిస్టులు సైన్స్ మాట్లాడితే బాగుంటుంది. కాని కొందరు భూతం ఆవహించినట్లు ఒక్కసారిగా అపారజ్ఞానసంపన్నులైన తత్వవేత్తలుగా మారి గొప్పమర్మాన్ని ఛేదించినట్లు ఒక చౌకబారు సిద్ధాంతాన్ని లేక విషయాన్ని ప్రకటించి దాన్ని నికార్సైన విజ్ఞానమంటారు. గుడ్డెద్దు చేలో పడినట్లు వీరు అనాలోచితంగా స్వార్థంతో వారి సిద్ధాంతానికి విపరీతమైన ప్రాచుర్యం కల్పిస్తారు. తానా అంటే తందానా అన్నట్లు, కాస్మాలజిస్ట్లు, క్వాంటం థియరిస్ట్లు ఈ సిద్ధాంతాలకి తమదైన ధోరణిలో మసాలా జోడించి, ఈ వ్యర్థసిద్ధాంతాలకి ఇంకా బలం చేకూరుస్తారు. శూన్యలోనుండి పదార్థోత్పత్తి వైజ్ఞానికంగా అసంభవమనే విషయం మరుగైపోతుంది. అసలు ఈ కాస్మాలజిస్టకి, క్వాంటం థీరిస్ట్లకి సైన్స్ తో ఏంపని? ప్రతిపాదనలై అధారపడి వారి పనిని కొనసాగించేవీరు, అసలు ఆ ప్రతిపాదన అంగీకారయోగ్యమైనదా లేదా అని గమనించలేనత బుద్ధిమాంద్యంతో ఉన్నారా? (1994)"     



No comments:

Post a Comment