Pages

Subscribe:

Sunday, 31 July 2011

భారతీయ బానిస వ్యాపారం-5

ఘోరిల దండయాత్ర: వాయువ్య భారతదేశాన్ని, గంగానది దిగువ ప్రాంతాల్ని జయించిన డెల్లీ పీఠ తుర్కలు (1206-1526).

1) ఘోరి పాలకులు, అనగా మొహమద్ ఘోరి మరియు ఆయన సైన్యాధిపతియైన కుతుబూద్దీన్ ఐబక్ (1206-1210) అద్వర్యంలో ఢెల్లీ సుల్తాన్ పీఠం స్థాపింపబడినది. అయితే వీరి పాలనలోకూడా సామూహిక శిరచ్ఛేదనాలు, బానిసలుగా మార్చుకోవడం, బలవంతపు మతమార్పిడులు, దోపిడీలు, అత్యాచారాలు, హిందూ ప్రార్థనా స్థలాల విధ్వంసాలు మాత్రం తగ్గలేదు. ఒక్కొక్క ముస్లింకి లెక్కకుమించి బానిసలుండిరి. ఉదాహరణకు 1195లో రాజా భీం నుండి ఐబక్ 20,000మంది బానిసల్ని తెచ్చుకొన్నాడు మరియు కళింగర్ దగ్గర 50,000 మంది బానిసల్ని తెచ్చుకొన్నాడు(1202) (లాల్:536).

"చివరికి పేద ముస్లిం దెగ్గర కూడా అనేకమంది బానిస సేవకులుండిరి (ఖాన్:103; లాల్:537)."



డెల్లీ సుల్తాన్‌పీఠావిర్భావం తరువాత ఢెల్లీ కేంద్రంగా దాడులు, బానిసల్ని చెరపట్టడం పెచ్చురిల్లాయి. హిందూస్థాన్ అంతట సామాన్య ముస్లింలకు కూడా లభ్యమయ్యేలా బానిసవిక్రయ కేంద్రాలు వెలిసాయి. ఈ బానిసలు వారికి ఒక వస్తువుతో సమానం. వీరిని ఎటుబడితే అటు తీసుకువెళ్లెవారు. కాలిఫ్(ముస్లిం మత ప్రథాన ఏలిక)కు ఐదవవంతు దోపిడిసొమ్ము మరియు బానిసలను పంపే సాంప్రదాయం ఆగిపోయింది. అయితే అప్పుడప్పుడు గౌరవసూచకంగా లేక బహుమానాలగా బానిసల్ని కాలిఫ్‌లకు, ధనిక ముస్లింలకు, ఇంకా చైనాకు కూడా పంపేవారు.

ముస్లిం సైన్యాలు విధ్వంసంచేసిన హోసలేశ్వర
దేవాలయంలో చేతులు తెగిపోయిన ఒక విగ్రహం

2) సుల్తాన్ ఇల్‌టుట్‌మిష్ (క్రీ.శ.1236) ఇతడు కూడా భారతీయుల్ని బానిసలుగా చేసుకోవడం వారిని బలవంతంగా ఇస్లాంలోకి మార్చడం చేసేవాడు. బానిసలపై ప్రభువుగా నియమింపబడిన ఉలగ్ ఖాన్ బల్బాన్ (1250లు-60లలో) లెక్కింపలేనంతమందిని బంధించాడు అని ఒక చరిత్రకారుడు వ్రాసాడు:
"ఆ అంధవిశ్వాసుల (హిందువుల) భార్యలు, పిల్లలు, ఆస్తులు వారిని జయించిన ముస్లిం సైనికుల     వశమయ్యాయి (లాల్:538)."

కతెహార్ అనే ప్రాంతంలో, 8 సంవత్సరాల వయసును మించిన మగవారినందరిని చంపేసి స్త్రీలను, పిల్లలను చెరపట్టమని బల్బాన్ తన సైన్యాన్ని ఆజ్ఞాపించాడు (లాల్:539).

హిందుస్థాన్లోని అనేక పల్లెలు, పట్టణాలపై సుల్తాన్ సైన్యం దాడులు జరిపి మందలు మందలుగా బానిసల్ని చెరపట్టుకుపోయారు. తప్పించుకొన్న హిందువులు కాలి బూడిదైన వారి గ్రామాలకు తిరిగి వచ్చేవారు. సుల్తాన్ సై
న్యం బంధించినవారు మాత్రం ఎన్నటికీ తిరిగిరాలేదు (లాల్:539).

3) ఖిల్జిల (1290-1320) మరియు తుగ్లగ్‌ల (1320-1413) పాలన

13, 14వ శతాబ్దాల ఖిల్జీలు మరియు తుగ్లగ్‌ల పాలనలో బానిసత్వం పెరిగింది, అలాగే ఇస్లాం కూడా వ్యాప్తిచెందింది. ప్రతిరోజు వేలమంది బానిసల్ని ఎంతో చౌకగా అమ్ముతుండేవారు (ఖాన్:258). అల్లావుద్దిన్ ఖిల్జి (1296-1316) విస్తారమైన బానిసల్ని చెరపట్టి, వారిని గొలుసులతో బంధించి, చిత్రహింసలు పెడుతూ ఘోరంగా అవమానించేవాడు. కేవలం ఒక్క సోమ్నాథ్‌పై దాడిలోనే, "20,000 మంది అందమైన స్త్రీలను, లెక్కింపలేనంతమంది పిల్లలను మహ్మదీయ సైన్యం చెరపట్టించి. వారి నివాసాల్ని, పట్టణాలని నేలమట్టంచేసి వారికి కలిగినదంతయు దోచుకొన్నారు. (బోస్టం: 641; లాల్:540)."

కొన్నివేలమంది వధింపబడ్డారు. అల్లవుద్దిన్ ఖిల్జి తన స్వంత సేవకే 50,000 మంది స్త్రీలను, పిల్లలను, అందమైన పురుషులను వినియోగించుకొనేవాడు. తన మందిరాల్లో మొత్తం 70,000 మంది బానిసలు నిత్యం పనిచేసేవారు. (లాల్:541).

ఆడవారు "జౌహార్" లేక "సతి" గావించేవారు. అంటే  ముస్లింలనుండి బానిసత్వం మరియు మానభంగాల్ని తప్పించుకోడానికి  నిప్పంటిచుకొని లేక మరోవిధంగా ఆత్మహత్య చేసుకొనేవారు. (తరువాత కాలంలో కొందరు స్వార్థ హిందూ ఛాందసవాదుల మూలంగా ఈ "సతి" భర్త చనిపోయిన స్త్రీలకు జరిగించుట ఆచారమైంది).

"తుర్కలు వారికి కావల్సినప్పుడెల్ల హిందువులను బంధించి, వారిష్టమొచ్చినట్లు చేసి, బానిసలుగా అమ్మేవారు" అని సూఫియుడైన అమీర్ ఖుస్రూ వ్రాసారు.   

13, 14వ శతాబ్దాలను గురించి ఒక హిందు చరిత్రకారుడు ఇలా వ్రాసాడు: " ఎక్కడచూసిన బానిసవిక్రయ
కేంద్రాలు ఉండేవి. అవెప్పుడూ హిందూబానిసలతో నింది ఉండేవి. ముస్లిం సైన్యాలు జరిపిన అనేక దాడుల్లో లక్షలమంది హిందువులు మృతిచెందారు. ఘోరి మాలిక్ అనే ముస్లిం ఆక్రమనదారునికి హిందువుల్ని నిర్దాక్షిణ్యంగా హతమార్చి, బ్రాహ్మణులను వారి గోవులను సమ్హరించి వారిని భయభ్రాంతులకు గురిచేయమని సందేశం పంపబడినది. దానిని నెరవేరుస్తూ ఈ తుర్కలు విధ్వంసం చేస్తూ, విచ్చలవిడిగా దోచుకొంటు, స్త్రీలను పిల్లలను చెరుస్తూ హత్యాకాండ గావించారు (లాల్: 634)."   

మొహమ్మద్ తుగ్లగ్ (1325-1351) అల్లావుద్దీన్ ఖిల్జీని తలదన్నేలా అనేకమంది హిందువులని బానిసలుగా చెరపట్టాడు.
"సుల్తాన్ విగ్రహారాధికులైన హిందువులను సంహరించుటకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు. ఈయన హయాంలో, ఎందరో హిందువులు బానిసలుగా చెరపట్టబడటం వలన బానిసల్ని అత్యంత చౌకగా కొనుగోలు చేసేవారు" అని ఒక చరిత్రకారుడు వివరించారు.   

సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లగ్ (1351-1388) ఈయన దెగ్గర 1,80,000 మంది అందమైన దృడమైన యువకులు బానిసలుగా ఉండిరి. 40,000ని అంగరక్షకులుగా కలిగి యుండెను. సుల్తాన్, తన సామంతుల్ని, అధికారుల్ని- యుద్ధాలు చేసినప్పుదెల్లా శ్రేష్ఠమైన బానిసల్ని తనకు పంపమని" ఆదేశించాడు (సూక్ధెయో: 165-167; లాల్:542).

ఈయన హయాంలో భారతదేశం వెలుపల కూడా అనేక బానిసవిక్రయ కేంద్రాలు నెలకొల్పబడ్డాయి. కాందహార్, గజిని, ఖురాసన్, సామర్ఖండ్ మొదలగు పట్టణాలకి సుదూరప్రాంతాలనుండి వర్తకులు, వ్యాపారులు భారతీయ బానిసలని కొనుగోలు చేయడానికి వచ్చేవారు. హిందువుల మధ్య నివసించే భారతీయ ముస్లింలు హిందువులను నొప్పించకుండా ఇతర (ఐరోపా, ఆఫ్రికా మొదలగు) జాతుల బానిసల్ని కొని తెచ్చుకొనేవారు. ఎందుకంటే చెట్టాలు ముస్లింలకు అనుకూలంగా ఉండటం వలన హిందు ఇరుగుపొరుగువారితో వ్యాపారలాలాదేవీలు ముస్లింలకు లాభదాయకంగా ఉండేవి కాబట్టి హిందు బానిసలను కలిగి ఉంటే వ్యాపారం సరిగా సాగదని వారు ఇతరజాతులను బానిసలుగా కలిగి ఉండేవారు(ఖాన్:318).  


Saturday, 30 July 2011

భారతీయ బానిస వ్యాపారం-4

ఫంజాబ్‌ను ఆక్రమించుకొన్న ఆఫ్గానిస్తాన్‌లోని గజినీ ప్రాంతవాసులైన గజినివిద్ తుర్కలు (Ghaznivid-Turks) (క్రీ.శ. 997-1206)

మొహమద్ గజినీ (997-1030) 17సార్లు హిందూస్థాన్‌పై దండెత్తి ఎంతో దోపుడు సొమ్ము తీసుకుపోయాడు అంతేగాక ఆయన చంపినవారు మరియు బంధిపబడి ఆఫ్గానిస్థాన్‌లోని గజినీ పట్టణానికి బానిసలుగా తీసుకుపోబడినవారు సుమారు 20లక్షలమంది (ఖాన్:315వ పుట). ఉదాహరణకు సుల్తాన్‌యొక్క కార్యదర్శి మరియు గణాంకుడైన ఉత్బీ,
సుల్తాన్ చరిత్ర గ్రంథంలో వ్రాసిన లెక్కలు-......తానేసర్‌నుండి ముస్లిం సైన్యాలు 2,00,000 మందిని గజినీ పట్టణానికి చెరపట్టుకొచ్చారు.......1019లో 53,000 మంది బానిసల్ని కొత్తగా బంధించి తెచ్చారు........ఇంకోసారి కాలిఫ్ కు దక్కవలసిన ఐదవవంతు బానిసలు 1,50,000 మంది (అంటే మొత్తం బానిసల సంఖ్య 7,50,000 మంది)....... తూర్పునుండి 5,00,000 బానిసలను ముస్లిం సైన్యం తీసుకువొచ్చింది..... 
ఇంకా మొహమద్ గజినీ కార్యదర్శియైన అల్-ఉత్బీ ఇలా వివరించాడు:
"దేవుని సైన్యమైన ముసల్‌మాన్‌లు 15,000 మందిని ఊచకోత కోసారు. వారి ఖడ్గాలు కారుమేఘాల్నుంచి వెలువడుతున్న మెరుపులవలే కదలసాగాయి, నేలరాలిన తోకచుక్కలా విగ్రహారాదికుల రక్తం ఏరులైపారింది. అంతేగాక అనంతమైన సంపద, 5,00,000 మంది అందమైన స్త్రీలు, పురుషులు బానిసలుగా ముస్లిం సైన్యానికి చిక్కారు (ఖాన్: 191)."

గజినివిద్‌లు ఇస్లాం సుల్తాన్ రాజపీఠమైన పంజాబ్‌లో 1186 వరకు ఏలారు. కాశ్మీర్, హన్సి మరియు పంజాబ్‌లో అనేక ప్రాంతాల్లో వీరు భయంకర నరమేదాలు చేసారు. ఎంతోమందిని బానిసలుగా చేసుకొన్నారు. ఉదాహరణకు 1079లో జరిగిన ఒక్క దాడిలోనే సుమారు 1,00,000 మందిని చెరపట్టి బానిసలుగా చేసారు (తారీక్-ఈ-అల్ఫీ, "ఖాన్" 276వ పేజీలో).   

Thursday, 28 July 2011

భారతీయ బానిస వ్యాపారం-3

బానిసత్వం:ఇప్పటి పాకిస్తాన్ (సింధ్), బంగ్లాదేశ్, మరియు కాష్మీర్లలో కొన్ని ప్రాంతాలు పూర్వం ఇండియాలో అంతర్భాగంగా ఉండేవి. ఇస్లాం దండెత్తకమునుపు (7వ శతాబ్దానికి మునుపు) ఆఫ్గనిస్తాన్లో బౌద్ధమతం మరియు హిందుత్వం ఉండేవి. 16వ శతాబ్దంలో ఆఫ్గనిస్తాన్ని భారతదేశాన్ని పరిపాలిస్తున్న మొఘల్ సామ్రాజ్యం మరియు పర్షియా యొక్క సఫావిద్ సామ్రాజ్యం పంచుకొన్నారు. 

మతఛాందసవాదులు కానటువంటి ఉమయద్ రాజులు హిందువులకు "దిమ్మీ" హోదా కలిపించారు. "దిమ్మీ" హోదా మాములుగా యూదలకి మరియు క్రైస్తవులకై కలిపించాలని ఖురాన్ సూచిస్తుంది. "దిమ్మీ" హోదా అనగా, ముస్లిం ఏలుబడిలో ఉన్న అన్య మతస్తులు (ఖురాన్ ప్రకారం కేవలం యూదులు, క్రైస్తవులు) వారి వారి మతాలలోనే కొనసాగొచ్చు కాని షరియా చట్టంలో ద్వితియశ్రేణి పౌరులుగా ఉంటారు. అంటే తోటి ముస్లింలకంటే అధిక శిస్తులు చెల్లించాలి, ఇంకా అనేక కట్టుబాట్లు ఉంటాయి. దిమ్మీలను సమాజంలో అధములుగా ఉంచుతారు. అయితే విగ్రహారాధికులైన హిందువులను ఖురాన్లో సూచించిన ప్రకారం హతమార్చాలి లేక ఇస్లాం స్వీకరించేటట్లు చేయాలి. అంటే ముస్లింల పాలనలో హిందువుల స్థితి యూదులు, క్రైస్తవలుకంటే ఇంకా దయనీయమైనది- వారికి రెండే మార్గాలు: చావాలి లేక ఇస్లాంలోకి మారాలి. ఉమయద్ లు ఖురాన్ కు వ్యతిరేకంగా హిందువులకు "దిమ్మీ" హోదా ఇవ్వడంలో వారి స్వార్థం ఎంతో ఉంది- ఒకటి, హిందువుల సంఖ్య చాలా విస్తారంగా ఉంది కాబట్టి షరియా ప్రకారం వీరికి దిమ్మి హోదా ఇస్తే అధిక శిస్తులు వసులుచేసి ఎంతో ధనం సమకూర్చుకోవచ్చు. రెండు, మతమార్పిడులు, సంహారాలు చేయకపోవడం వలన హిందువుల దృష్టిలో ఇతర ముస్లిం పాలకులకంటె మంచివారిగా పేరు సంపాదించుకోవచ్చు. అయితే కొందరు ముస్లిం పెద్దలు, హిందువులను ఎందుకు సంహరించడం లేక మతం మార్చుకొనేట్లు చేయడంలేదని హుమయూన్ రాజును (సం. 1236) అడుగగా, అతడిట్లన్నాడు:
"హిందువులకు దిమ్మీ హోదా ఎందుకిచ్చామంటే ప్రస్తుతం ఈ దేశంలో ముస్లింల సంఖ్య చాలా తక్కువ. ఇంకొన్నేండ్లలలో పట్టాణాల్లో, పల్లెల్లో ముస్లిం జనాభా బాగా పెరిగిన తరువాత హిందువులను చావు లేక ఇస్లాంలోకి మారడం మధ్య ఎదోఒకటి ఎన్నుకోమని శాసించవచ్చు" అని నచ్చజెప్పాడు (లాల్: 538వ పుట).   


పేరుకి దిమ్మీ హోదా పొందినప్పటికీ హిందువుల మీద దాడులు, హత్యాకాండలు, మతమార్పిడులు, బానిస  వ్యాపారం వంటివి చురుగ్గా సాగుతూనే ఉందేవి. తిరగబడ్డవారిని నిర్దాక్షిణ్యంగా చంపడం, అందమైన బాలురలను నపుంసకులనుగా చేసి బానిసలుగా చేసుకోవడం మరియు కామవాంఛలు తీర్చుకోవడానికి వారిని వాడుకోవడం సర్వసాదారణమైపోయింది. ఈ విథంగా హింసింపబడ్డవారు మరియు చంపబడ్డవారు ఎంతమందో వాస్తవ సంఖ్య తెలియనప్పటికి ఊహింపలేనటువంటి స్థాయిలో అత్యదికులు ముస్లిముల బారిన పడ్డారని వారి చరిత్రకారుల రాతలనుబట్టి తెలుసుకోవచ్చు. హిందువుల ఆత్మగౌరవానికి, మానప్రాణాలకు కలిగే ముప్పుగాక వారి ఆస్తిపాస్తులు, నగనట్ర అన్నీ ముస్లింలు దోచుకొనేవారు. 

ముస్లిం పాలకులు స్థానికులు కాదు, మధ్యప్రాచ్యం నుండి దండెత్తివచ్చినవారు, కాబట్టి 13వ శతాబ్దంవరకు వారు బానిసల్ని భారతదేశంనుండి మధ్యప్రాచ్యానికి తరలిస్తూ ఉండేవారు. అయితే 1206 సం. లో ఢిల్లీ సుల్తానైట్ (సుల్తానుల పాలనకేద్రం-ఢిల్లీ. పరిపాలన ఢిల్లీ నుండి సాగేది కాబట్టి పరిపాలనాయంత్రాగం, వారి పరివారాలు ఇక్కడే నివసించుటకు వచ్చారు) స్థాపించాక భారతీయ బానిసల ఎగుమతి కొంచెం తగ్గింది. ఎందుకంటే ఢిల్లిలో వారి సేవలు అవసమైయ్యాయి. అయినప్పటికీ అవసరాలనుబట్టి బానిసల్ని వివిధప్రాంతాలకి తరలించేవారు. అంతేగాక ఇతరప్రాంతాల (యూరోప్, ఆఫ్రికా) బానిసల గుంపుల్ని ఇక్కడికి తీసుకొచ్చేవారు. ఈ విధంగా ముస్లిం సైనిక బలగాలు ముస్లిములుగా మార్చబడ్డ వివిధజాతుల ప్రజలతో, హిందువులతో, మతమార్పిడిచెందిన భారతీయ ముస్లింలతో వైవిధ్యంగా ఉండేది. ఖురాన్ ప్రకారం బానిసలు అల్లాచే వాగ్దానంచేయబడిన దోపిడిసొమ్ము, కాబట్టి ఎక్కువ బానిసలను సంపాదించుకోవడం అనేది జీహాద్ జరిగించుటకు ఒక ప్రథాన కారణమయ్యేది.


"బానిసలు ఎంత అధికమైపోయారంటే నామమాత్రపు సొమ్ముతో వారిని కొనుగోలు చేయొచ్చు. ఇదంతా అల్లా దయనే. ఆయనను నమ్ముకొన్న ఇస్లామీయులను ఆయన ఇలా బానిసలనిచ్చి హెచ్చిస్తాడు, అవిశ్వాలు, విగ్రహారాధికులను నలుగగొట్టి దిగజారుస్తాడు (క్రీ.శ. 942-997 వరకు గజినీలు చేసిన దండయాత్రలలో చెరపట్టబడి బానిసలుగా చేసుకోబడినవారిని గూర్చి వ్రాయుచు సుల్తాన్ సుబుక్తిగిన్ జరిపిన ఒక దండయాత్రను గూర్చి వివరించుచూ ముస్లిం చరిత్రకారుడైన ఉత్బీ వ్రాసిన వాక్యాలు).  

ముస్లిం పాలకులచే మొట్టమొదట కైవసం చేసుకొబడిన సింధ్ ప్రాంతంలో అత్యదికులు బలవంతంగా ఇస్లాంలోకి మార్చబడిన బానిసలు మరియు వారి యజమానులైన కొందరు అరబ్బు ప్రభువులుండేవారు (ఖాన్:299). మొదట్లో బానిసల్ని భారత భూభాగంనుండి బలవంతంగా వెలుపలకు తరలించేవారు. ఉదాహరణకు, మొదటి వాలీద్ కాలీఫ్ సంస్థానపు ప్రభువైన హజ్జజ్ బిన్ యూసుఫ్ చే పంపబడిన ఖాసీం అనే సైన్యాధిపతి క్రీ.శ.712 నుండి 715 వరకు మూడేండ్లలో జరిపిన దండయాత్రల్లో 3,00,000 మందిని బంధించి బానిసలుగా తరలించుకుపోయాడు (ఖాన్ 299వపుట; ట్రిఫ్కోవిక్ పీ 109వ పుట). ఈ జీహాద్ లో వివిధ ప్రాంతలనుండి వచ్చిన అనేక ముస్లిం యోధులు పాల్గొనేవారు. ఒకసారి అనుకోకుండా ఖాసీం ను వెనక్కు పిలిపించి బహుశా జంతుచర్మాలలో కుట్టించబడి చచ్చునట్లుగా మరణశిక్ష విధింపబడెను, ఎందుకంటే కాలిఫ్ (ప్రభువు) యొక్క ఉపపత్నులశాలకు తరలింపబడుటకు సిద్ధపరచబడిన ఇద్దరు సింధీ యువరాణులతో కాసీం సంభోగించినట్లు అభియోగం మోపబడెను(లాల్: 439వ పుట). 

వివిధ కాలీఫ్ ల హయాంలో 8వ మరియు 9వ శతాబ్దాల్లో బానిసలకొరకు అనేక దండయాత్రలు జరిగేవి.     
 

Tuesday, 26 July 2011

భారతీయ బానిస వ్యాపారం-2

ముస్లింల దండయాత్రల వలన అపారమైన ప్రాణ, ధన నష్టాలు మరియు సంస్కృతి వినాశనం జరిగాయి. చారిత్రిక గణాంకాల ప్రకారం క్రీ.శ. 1000 నుండి 1525వ సంవత్సరం వరకు సుమారు 10 కోట్లమంది ఊచకోతకోయబడ్డారు. అంటే 500 యేండ్లపాటు జనాభా అబివృద్ధి చెందాల్సిందిపోయి క్షీణించింది (లాల్ గారు  ఎం.ఏ.ఖాన్ రచించిన Islamic Jihad: A Legacy of Forced Conversion, Imperialism, and Slavery అనే పుస్తకంలోని 216వ పుటలో సూచించిన గణాంకం). నమ్మశక్యంగా లేదా? ఐతే ఈ లెక్కలు గమనించండి: 1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం కేవలం 9 నెలల్లో సుమారు 30 లక్షలమంది బంగ్లాదేశి ముస్లిం మరియు హిందువులను, కొందరు భారతీయులను వధించింది (ఖాన్ 216 పుటలో). ముస్లింలు జరిగించే హింసాకాండను ప్రతీసారి చూసిచూడనట్లు విస్మరించే అంతర్జాతీయ సమాజం, ఈ ఊచకోతనూ పెద్దగా పట్టించుకోలేదు. 


అధారాలను మరియు గణాంకాలను పరిశీలిస్తే విస్మయకరమైన పెద్ద సంఖ్యలో భారతీయులను ఇస్లామిక్ క్రూర రాజ్యాలు బానిసలుగా చేసుకొన్నాయి. భారతభూభాగాలపై ముస్లింలు జరిపిన దండయాత్రలు బహుశా ప్రపంచచరిత్రలో అత్యంత రక్తసిక్తమైనవేమో! ఖాన్:201వ పుటలో చరిత్రకారుడైన డ్యురంట్ ఇలా అన్నాడు:
"హిందువుల ఊచకోత, బలవంతపు మతమార్పిడులు, హిందూ దేవాలయాల కూల్చివేత, బానిస సంతల్లో వేలంవేయడానికి చెరపట్టుకుపోబడిన హిందూ స్త్రీలు, పిల్లలను గూర్చిన విషయాలను, ముస్లిం రాజులు క్రీ. శ. 800-1700 వరకు జరిగించిన భయంకరమైన రాక్షస కార్యాలని గొప్ప విజయాలుగా గర్వంతో అత్యుత్సాహంతో ముస్లిం చరిత్రకారులు ఇస్లామిక్ రాజుల గ్రంథాలలో వర్ణశోభితంగా వ్రాసారు." 

అరబ్బు ఆక్రమణదార్లు అసలేంచేసారో తెలుపుతు రిజ్వాన్ సలీం ఇలా వ్రాసారు:
"నాగరికతలో అత్యంత హేయమైన క్రూరులుగా పిలవబడుటకు ఏ సంస్కృతీ ఇష్టపడని ముష్కరులు అరేబియా మరియు పశ్చిమాసియా నుండి 7వ శతాబ్దంలో భారతభూమిలోకి రాసాగిరి. ఈ ఇస్లామిక్ ఆక్రమణదార్లు దండెత్తి వచ్చి మగవారినందరిని తెగనరికి, అనేక హైందవ దేవాలయాల్ని, విగ్రహాలని, శిల్పాలని తుత్తినియలుచేసి, కోటలను రాజమందిరాలని కొల్లగొట్టి విస్తారమైన దోపుడు సొమ్మును, స్త్రీలను పట్టుకొనిపోయిరి.....కానీ చాలామంది భారతీయులు, ఎంతో పరిణతిచెందిన, అన్ని నాగరికతలకంటె విజ్ఞానంలో, వైద్యంలో ఇంకా అనేక శాస్త్రాలలో ముందున్న నాగరికత, ఎంతో సృజనాత్మకత కలిగిన, శాంతికరమైన సంస్కృతిని ఈ ముస్లిం ముష్కరులు నాశనం చేసారన్న విషయం గ్రహింపకున్నారు (ఖాన్:179వ పుటలో)." 

ఇస్లాం ఇండియాలో ప్రవేశింపకమునుపు కూడా యుద్ధాలు జరిగాయికాని, అవి ఒక జాతి లేక రాజ్య వినాశనానికి, అసంఖ్యాకమైన బానిసలకోసం, స్త్రీలకు, పిల్లలకు చివరకు పసికందులకు కనీస విలువ ఇవ్వకుండా, కొంచెమైనా కనికరం చూపకుండా కామతృప్తికొరకైన వస్తువులునగా వాడుటకు, దేవాలయాల్ని నాశనం చేయుటకు, చేలను పాడుచేసి రైతులను జంతువులనుగా పనిచేయించుటకు ఈ యుద్ధాలు జరుగలేదు మరియు ఈ యుద్ధాలు ఇరు సైన్యాల మధ్య జరిగేవి, రాజ్యాధికారం మారుతూ ఉండేది కాని సామాన్యుని ప్రాణానికి మానానికి ఇంటికి ఆస్తికి ముప్పువాటిల్లేదికాదు. దోపిడీలు ఊచకోతలు ఈ యుద్ధాలలో జరిగేవికాదు. కాబట్టి ఇస్లామిక్ దండయాత్రల పర్యవసానాలను భారతప్రజలు గ్రహింపలేకపోయారు. రాజు, ప్రజా తేడాలేకుండా ముస్లిం పాలకుల చేతుల్లో అందరూ విలవిలలాడారు. వీరి సమాజం, ఇస్లాం పాలకులయొక్క అధిక శిస్తులతో, శిక్షలతో చిన్నాభిన్నమైపోయింది. గత్యంతరంలేక కొందరు మతం మారారు, ఇంకొందరు అడవులకు, కొండలలోకి పారిపోయి బలహీనులై రోగాలతో, క్రూరమృగాలబారిన పడి తనువులు చాలించారు. ముస్లింలు, హిందూస్త్రీల భర్తలను వారి కళ్ళముందే చంపి, భర్తల నెత్తురు చల్లారకముందే వారి భార్యలతో బలవంతంగా శయనించేవారు. భారత సమాజాన్ని ఘోరంగా కీంచపరచి, సంస్కృతిని పాడుచేసి, తిరగబడినవారిని కిరాతకంగా చంపుతూ, అన్యాయంగా నేరారోపణలు చేస్తూ భారతావనిని దయనీయస్థితిలోకి చేర్చారు. అప్పుడప్పుడూ ముస్లిం రాజుల మధ్య జరిగే యుద్ధాల్లోను హిందువులే అధికంగా బలైయ్యేవారు, ఎందుకంటే హిందువులను ముందు  కవచంగా (battlefield front line) ఉపయోగించుకొనేవారు (ఖాన్ 205-207 పుటల్లో).   

భారతీయ బానిస వ్యాపారం-1

భారతదేశానికి ఎంతో ఉన్నతమైన, ప్రాచీన సాంస్కృతిక చరిత్ర ఉన్నది. క్రీ.పూ. 1500 సంవత్సరాల క్రితం హైందవమతం, క్రీ.పూ. 600 సంవత్సరాలక్రితం బౌద్ధమతం ప్రారంభమైయ్యాయి. భారతసంస్కృతి శాస్త్రాలలో, కళలలో, మతంలో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది. భారతీయ విద్వాంసులు సైన్స్ లో, గణితంలో ఎంతో ప్రగతిని సాధించారు (సున్నా, భీజగణితం, రేఖాగణితం, దశాంశ విధానం మొదలగు అరబిక్ గణితావిష్కరణలు వాస్తవంగా "హిందూ ప్రజల ఆవిష్కరణలు! ఇవి ముమ్మాటికి భారతీయ విజ్ఞానుల విజ్ఞతే!). భారతీయ విద్వాంసులు ఈ గణిత విజ్ఞానాన్నే గాక, వైద్యశాస్త్రం, తర్కశాస్త్రంలోని అనేక ప్రావీణ్యతలను, ఉన్నత ప్రమాణాలను ఇతర రాజ్యములలోకి తీసుకువెళ్లిరి (ముస్లిం రాజ్యాలకు కూడా! ఉదా: బాగ్దాద్).

ఎక్కడెక్కడినుంచో ఇతరులు భారతీయ విశ్వవిద్యాలయాలలో చదువునభ్యసించుటకు వచ్చేవారు (నలంద విశ్వవిద్యాలయం ప్రపంచంలోనే అతిపురాతనమైనది). భారతీయ విద్యార్థులు విస్తారమైన అంశములలో, అనగా సైన్స్, గణితం, తర్కశాస్త్రం, వైద్యశాస్త్రం మొదలగువాటిని అభ్యసించేవారు. భారతీయ కళలు, కట్టడాలు అద్భుతంగా ఉండేవి. భారతతీయులు పరిణతిచెందిన ప్రగతిశీలురైయుండిరి. ఇటువంటి సమయంలో క్రీ.శ. 7వ శతాబ్దంలో భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశించింది. వెంటనే భోగభాగ్యాలు పోయి, ఊచకోతలు, అత్యాచారాలు, హింస, దోపిడీలు, సాంస్కృతిక, హైదవ కట్టడాలను, పట్టణాలను, కళలను, క్షేత్రాలను వినాశనం చేయడం ఆరంభమైనది. కొన్నిచోట్ల వాటి స్థానంలోనే ఇస్లామిక్ కట్టడాలు వెలిసాయి. జనాలలో వైజ్ఞానిక తృష్ణ కుంచించుకుపోయింది, హింసాప్రవృత్తి, స్వార్థం పెరిగిపోయింది. హింస, కరువులు, దోపిడీలు, మానభంగాల భయంతో బలవన్మరణాలు, మతమార్పిడులు విస్తారంగా జరిగాయి. ఇస్లాం ప్రకారం ఏదైనా విషయం ఇస్లాంలో అపరిచితమైతే లేక ఇస్లామునకు పూర్వమైనదైతే అదివారికి మూఢమైన కాలానికి (అజ్ఞానాంధకార చరిత్రకి) చెందినదిగా (jahiliyya- time of ignorance) భావిస్తారు మరియు ఇస్లాం ప్రకారం దానిని నాశనం చేయాల్సిందే (ఉదా: ఆఫ్గాన్ లో హిందూ మరియు బౌద్ధ ఆలయాలు, విగ్రహాలు స్థూపాలు). ఒకవేళ అది విలువైనది, లాభకరమైనదైతే దానిని ఇస్లాం పరం చేసుకోవాల్సిందే (ఈజిప్ట్ పిరమిడ్లు- సందర్శకుల వలన చాలా లాభం!). ఈ నిరంతర ఊచకోత జనాల్ని అస్థిరులుగా, సంచారకులుగా (gypsies) చేసింది, హైందవ ఆఫ్గానిస్తాన్ని నాశనం గావించి పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లను పుట్టించింది!             

Sunday, 24 July 2011

"దేవుడున్నాడా?"- ఇంకొన్ని తర్కవాదాలు.

దేవుడున్నాడా? అనే శీర్షికతో దేవుని ఉనికిని తార్కికంగా, హేతుబద్ధంగా, శాస్త్రీయంగా నిరూపించడానికి కారణకార్యములు- విశ్వశాస్త్ర తర్కాన్ని 6 భాగాలలో వివరించాను. అయితే దేవుడున్నాడు అనడానికి సృష్టిలో సృజనాత్మక రూపక తర్కం (Teleological Argument) మరియు ఇంకొన్ని వాదనలనుకూడా ఈ బ్లాగులో వివరిస్తాను.

ఈ బ్లాగులో ఇంకా జీవపరిణామం evolution, పురావస్తుశాస్త్రం archaeology, జీవశాస్త్రం Life sciences, భౌతికశాస్త్రం physics, చరిత్ర history మొదలగు అంశాలపై విస్తృతమైన వ్యాసాలు, చదువుటకు అనుగుణంగా చిన్న చిన్న భాగాలుగా ప్రచురించాలని యోచిస్తున్నాను. 

దేవుడున్నాడా?-6

3. విశ్వం సృజింపబడిందా?

విశ్వానికి ఒక ఆరంభమైనా ఉండాలి లేక అది ఆదిసంభువైయుండాలి. మనకున్న అధారాలనుబట్టి విశ్వానికి ఒక పుట్టుక (ఆరంభం) ఉన్నది అని స్పష్టమవుతుంది. "ఆరంభం" అనేది ఒక కార్యం కాబట్టి దానికి ఒక కారణం ఉండాలి (Law of Cause and Effect). అంటే విశ్వాన్ని ఏదైనా లేక ఎవరైనా సృష్టించి ఉండాలి. కారణం లేక కర్త లేనిది ఏ కార్యం జరుగదు.

విశ్వం ఆదిసంభువు మరియు విశ్వం స్వీయోత్పత్తి గావించుకొన్నది అనే ప్రతిపాదనలు వ్యర్థమైనవని గత భాగాల్లో వివరించబడింది. ఇక మిగిలింది విశ్వం సృజింపబడుట అనే ప్రత్యామ్నాయం. కాబట్టి విశ్వం తనకంటే బలమైన ఒక శక్తిచే సృజింపబడినది.

ఇంకో విషయం ఏమిటంటే, ఒకప్పుడు అంతా శూన్యముంటే, ఇప్పుడూ ఇంకెప్పుడూ శూన్యమే ఉండాలి. సైన్స్ ప్రకారం శూన్యం శూన్యాన్నే ఇవ్వగలదు కాని పదార్థాన్ని కాదు. ఈ కారణంగా ఇప్పుడు పదార్థం (విశ్వం) ఉంది గనుక నిత్యత్వం కలిగిన, స్వయంభువైన రాశి లేక శక్తి ఉండియుండాలి. ఆ శక్తి సృజన గావించాలంటే జీవముగలదై లేక గలవాడైయుండాలి (Nothing produces nothing and something produces something; And that something which is capable of producing or creating ought to be superior and eternal).    

ఇప్పటివరకు గమనించిన విషయాలను పరిగణలోకి తీసుకొంటె, ఒక ఆస్తికుని వాదం ఇలా ఉంటుంది:
1) ఉనికి కలిగియున్న సర్వం పదార్థం మరియు సృజన శక్తి కలిగిన జీవమైయుండాలి.
2)ఇప్పుడు పదార్థ లేక వస్తువు ఉనికి ఉంది గనుక అనాదిగా ఉనికికలిగియున్నదేదైనా ఉండియుండాలి.
3)కాబట్టి పదార్థం లేక సృజన శక్తి అను రెంటిలో ఒకటి ఆదిసంభువైయుండాలి.
4)పదార్థం (విశ్వం) తననుతాను సృజించుకొనలేదు కాబట్టి అది ఆదిసంభువు కాదని మనము తెలుసుకొన్నాం.
5)కాబట్టి సృజన శక్తి కలిగినదే లేక కలిగినవాడే ఆదిసంభువు లేక నిత్యుడు.

ఆస్తికుడు కానటువంటి రాబర్ట్ జస్త్రో ఇలా అన్నాడు: "మనకున్న ఆధారలనుబట్టి విజ్ఞానానికందని ఒక అద్వితీయమైన శక్తి ఉన్నది అనునది సైన్స్ కూడా తప్పక చెప్పే సత్యం! (1982)."

దీనంతటినీ ఒక సామాన్యభాషలో చెప్పాలంటే:

ఉదాహరణకు, ఒకచోట కొన్ని సిమెంట్ బస్తాలు, ఇసుక, నీరు, ఇటుకలు, రాళ్ళు ఉన్నాయనుకోండి. తాపిపనివాడు లేకుండా వాటంతటవే ఒక నిర్మాణంగా రూపుదిద్దుకొంటాయా?
"రూపుదిద్దుకొంటాయి" అని మన పిల్లలను పంపే స్కూల్లలో గొప్ప scientific factsగా బోధించుచున్నారు! రూపుదిద్దుకొంటే దిద్దుకొన్నాయి, అసలు ఈ ముడి పదార్థాలు ఎక్కడివి? "అవీ వాటంతట అవే శూన్యం నుండి వచ్చాయి!"- ఇది మన సైన్స్!
సత్యమేదో మీరే గ్రహించండి. ఎందుకంటే సత్యం మనలను స్వంతంత్రులనుగా చేస్తుంది!

సత్యమేవ జయతే!!

NOTE: I'm not against science, but some 'madness' is proclaimed as science and an exhaustive propaganda campaign has been launched just out of resentment and anger against the idea of God! I absolutely uphold, accept, and follow true science, and true science always reflects true God which is unfortunately a buried and lost truth! 

------------------END------------------------